● వి.కోట విలేకరికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిక ● న్యాయం చేయాలని సీఎం చంద్రబాబుకు డాక్యుమెంట్‌ రైటర్‌ వినతి | - | Sakshi
Sakshi News home page

● వి.కోట విలేకరికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిక ● న్యాయం చేయాలని సీఎం చంద్రబాబుకు డాక్యుమెంట్‌ రైటర్‌ వినతి

Jun 23 2026 11:53 PM | Updated on Jun 23 2026 11:53 PM

● వి.కోట విలేకరికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిక ● న్యాయం చేయాలని సీఎం చంద్రబాబుకు డాక్యుమెంట్‌ రైటర్‌ వినతి

డాక్యుమెంట్‌ రైటర్‌కు

టీడీపీ నేత బెదిరింపులు

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద సుమారు 14 సంవత్సరాలుగా డాక్యుమెంట్‌ రైటర్‌ గా జీవనోపాధి చేసుకుంటున్న తనకు పొంచి ఉన్న ప్రాణహాని నుంచి కాపాడాలని డాక్యుమెంట్‌ రైటర్‌ ఏఎస్‌ మహ బూబ్‌ ఉన్నతాధికారులకు విజ్ఞ ప్తి చేశారు. మంగళవారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. స్థానిక వార్డు కౌన్సిలర్‌, టీడీపీ నేత జాకీర్‌ ఈ నెల 15న తన వద్దకు వచ్చరన్నారు. తనకు ఒక డాక్యుమెంట్‌ చేసి పెట్టమని చేప్పాడన్నారు. కాగా అదే రోజు 11.30 గంటలకు బుక్‌ చేసి ఇచ్చానన్నారు. చలనా విషయంలో జరిగిన వాదనపై జాకీర్‌ దుర్భాషలాడి తన ఎడమ చెంపపై కొట్టి ‘నాతో పెట్టుకుంటే నిన్ను నామరూపాలు లేకుండా చేస్తా. నా సెటిల్మెంట్లకు అడ్డు వస్తే వి కోటలో విలే కరికి పట్టిన గతే నీకు పడుతుంది. నువ్వు వెళ్లి పోలీస్‌ స్టేషన్లో కంప్లైంట్‌ ఇస్తే ఎవరూ తీసుకోరు. నీ మీదే రిటర్న్‌ కంప్‌లైంట్‌ ఇస్తా, నీ భార్య బిడ్డలను బతకనివ్వను’ అని హెచ్చరించాడని ఆరోపించారు. వార్డు కౌన్సిలర్‌ జాకీర్‌, అతని అనుచరుల నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తనకు తన కుటుంబానికి ఏదైనా జరిగితే వారిదే బాధ్యతని, తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబా బు , డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రి లోకేష్‌కు లేఖ ద్వారా కోరారు.

వేరుశనగ 4,200 క్వింటాళ్లు మాత్రమే సరఫరా

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఇప్పటి వరకు జిల్లాకు వేరుశనగ విత్తనం 4200 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయింది. ఏప్రిల్‌లో వ్యవసాయశాఖ అధికారులు జిల్లాకు 27 వేల క్వింటాళ్ల కాయలు కేటాయించారు. ఈ మేరకు కుప్పం, పలమనేరు మండలాలకు మాత్రం 4,200 క్వింటాళ్ల కాయలొచ్చాయి. మిగిలిన మండలాలకు మొండిచేయి మిగిలింది. జూన్‌ నెల ముగుస్తున్నా కాయలు ఇవ్వకపోవడం ఏమి టని మండిపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement