సాయికృష్ణ కేసులో
పలు అనుమానాలు
నగరి : సాయికృష్ణ కేసులో మొదటి రోజు నుంచే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కీలకమైన సీసీటీవీ ఫుటేజీ మాయం అయిందనే వార్తలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయన్నారు. సాక్ష్యాలే మాయం అయితే నిజం ఎలా బయటకు తీస్తారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. సాక్ష్యాలను భద్రపరచాల్సిన పోలీసులే వాటిని కాపాడలేకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలన్నారు. సీసీటీవీ ఫుటేజి మాయం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోందన్నారు. ఫుటేజీ మాయంపై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదో తెలపాలన్నారు. లాకప్ డెత్‌లో నిజానిజాలు బయటపడే వరకు వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.


