కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం వినతులు స్వీకరించిన కలెక్టర్ సత్వరం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
చిత్తూరు కలెక్టరేట్ : అధికారుల తప్పిదాలు, కొందరి అక్రమాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. ‘ఆలకించి దయచూపండయ్యా.. అని పలువురు ప్రజలు వాపోయారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో తమ గోడును కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఎదుట వెల్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ వినతులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై 238 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ అధికారు లు వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ ఆదర్శ్ రా జేంద్రన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


