నిరంతర అధ్యయనంతోనే మెరుగైన వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

నిరంతర అధ్యయనంతోనే మెరుగైన వైద్య సేవలు

Jun 22 2026 12:18 AM | Updated on Jun 22 2026 12:18 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): మనోవైద్య రంగంలో తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలు సుకుంటూ నిరంతర అధ్యయనం చేయ డం ద్వారానే రోగులకు అత్యుత్తమ వైద్య సేవ లు అందించగలమని ది అపోలో యూనివర్సి టీ వైస్‌ ఛాన్స్‌లర్‌ హెచ్‌.వినోద్‌ భట్‌ తెలిపారు. చిత్తూరు నగరంలోని అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఏఐఎంఎస్‌ఆర్‌) సైకియాట్రీ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం రాప్ప్‌స్‌–2026 (రాపిడ్‌ అపోలో సైకి యాట్రీ ప్రిపరేషన్‌ ఫర్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌) కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి శాసీ్త్రయ సదస్సులు భవిష్యత్‌ వైద్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అలాగే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు దోహద పడతాయన్నారు. ఏఐఎంఎస్‌ఆర్‌ అసోసియేట్‌ డీన్‌ రమ్య రామకృష్ణన మాట్లాడుతూ వైద్య విద్యలో నాణ్యతను పెంచేందుకు ఏఐఎంఎస్‌ఆర్‌ ఆధునిక శిక్షణా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో అపోలో నాలెడ్జ్‌ సిటీ యూనిట్‌ హెడ్‌ బాలరాజ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

చిత్తూరు కార్పొరేషన్‌: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ తెలిపారు. సోమవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నా రు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. అర్జీదారులు మీకోసం కాల్‌ సెంటర్‌ 1100 నంబర్‌ను సంప్రదించి కూడా ఫిర్యాదులను తెలియజేయవచ్చని వివరించారు.

ఆర్యావర్క్‌, ఫాబ్రిక్‌

పెయింటింగ్‌పై శిక్షణ

చంద్రగిరి: యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 29వ తేదీ (సోమవారం) నుంచి 31 రోజుల పాటు మహిళలకు ఆర్యవర్క్‌, ఫాబ్రిక్‌ పెయింటింగ్‌పై పూర్తి ఉచితంగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్‌ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం అందించడం జరుగుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువ పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్‌ , రేషన్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

ప్రశాంతంగా నీట్‌ పరీక్షలు

చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరులో ఆదివారం నీట్‌ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్టు నీట్‌ సిటీ కో ఆర్డినేటర్‌ జీవనజ్యోతి తెలిపారు. నగరంలోని పీవీకేఎన్‌, సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలు, లిటిల్‌ ఫ్లవర్స్‌ పాఠశాలలోని పరీక్ష కేంద్రాల్లో మొత్తం 1,111 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 133 మంది గైర్హాజరైనట్టు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ, ఎస్పీ తుషార్‌ డూడీ తనిఖీ చేశారు.

మానవత్వం చాటుకున్న పోలీసులు

పోలీసులు ఆదివారం నీట్‌ పరీక్షల్లో విద్యార్థికి సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. పుంగనూరు మండలం బర్నేపల్లెకు చెందిన శోభన్‌ పరీక్ష రాయడానికి సావిత్రమ్మ కళాశాలకు వచ్చాడు. ఆధార్‌ కార్డు జిరాక్స్‌ తీసుకువచ్చాడు. ఒరిజినల్‌ ఉంటేనే లోనికి అనుమతి ఇస్తామని అధికారులు చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన అతడిని గమనించిన పోలీసులు వెంటనే పోలీసు వాహనంలో నెట్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆధార్‌కార్డు డౌన్‌లోడ్‌ చేయించి సరైన సమయానికి పరీక్ష కేంద్రంలో వదిలిపెట్టారు. దీంతో అతని ఆనందానికి హద్దుల్లేవు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement