చిత్తూరులో యోగాసనాలు వేస్తున్న అధికారులు, ప్రజలు
కాణిపాకంలో యోగాసనాలు వేస్తున్న ఆలయ సిబ్బంది, ఉద్యోగులు
చిత్తూరు కార్పొరేషన్/కాణిపాకం: నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చుడా చైర్‌పర్సన్ హేమలత, డీఆర్వో మోహన్‌కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్‌వో ఉదయభాస్కర్, ఆయుష్ నోడల్ అధికారి గోవిందప్ప, యోగా గురువులు శ్రీనివాసులునాయుడు, బాబునాయుడు పాల్గొన్నారు. అదేవిధంగా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు, డీఈవో సాగర్‌బాబు, ఏఈవోలు ఎస్‌వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ప్రసాద్,
ధనపాల్, తదితరులు పాల్గొన్నారు.


