పోలీసులు చట్టప్రకారమే వ్యవ హరించి ఉంటే పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలి. అరెస్ట్ ఎప్పుడు చేశారు? ఏ పరిస్థితుల్లో ఉంచారు? ఎలా మృతి చెందాడు? ప్రతి ప్రశ్నకు ప్రభు త్వం సమాధానం చెప్పాలి. నిజం ప్రభుత్వ వైపే ఉంటే దాన్ని దాచాల్సిన అవసరం ఏముంది? సాయికృష్ణ తల్లిదండ్రు లు తన కొడుకు మృతదేహమైనా.. లేకుంటే బూడిదైనా ఇవ్వండి అంటున్నారు. దీనిపై ప్రభు త్వం నోరు తెరవాలి.
– విశ్వనాథ్, శ్రీకృష్ణదేవరాయుల బలిజ సభ్యులు, చిత్తూరు
పవన్ కల్యాణ్
స్పందించాల్సిన సమయం ఇదే
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్యాయం జరిగితే ముందుండి పోరాడిన పవన్ కల్యాణ్ ఇప్పు డు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒక కాపు యువకుడి కుటుంబం న్యాయం కోరుతున్న వేళ ఆయ న మౌనం ప్రజలను బాధిస్తోంది. రాజకీయాలకు అతీతంగా స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలి. ఈ ఘటనపై అనుమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హైకోర్టు పర్యవేక్షణ లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలి.
– మల్లేల గౌతమ్‌రాజ్,
శ్రీకృష్ణదేవరాయుల బలిజ సభ్యులు, చిత్తూరు


