చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
నేడు పోలీసు గ్రీవెన్స్
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజాఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఎస్పీ తుషార్‌డూడి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజ లు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు.
ఐదుగురిపై కేసు నమోదు
చిత్తూరు అర్బన్: చిత్తూరు అర్బన్ పరిధిలో నాలుగు బెల్ట్ దుకాణాలను గుర్తించి నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ రవి తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన ఓ వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసి వారి నుంచి 32 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.
బైక్‌ను ఢీకొన్న కారు
పూతలపట్టు(యాదమరి) : పూతలపట్టు మండలంలోని రంగంపేట క్రాస్ సమీపంలో చిత్తూరు–పూతలపట్టు జాతీయ రహదారిపై ఆదివారం బైక్‌ను కారు ఢీకొంది. దీంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని గొడుగుచింత గ్రామానికి చెందిన దాము పూతలపట్టులో ఫొటో స్టూడియో నడుపుతున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనుల నిమిత్తం పి.కొత్తకోట వైపు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. అదేసమయంలో చిత్తూరు వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన దామును తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
నగరి : మున్సిపల్ పరిధి కొండచుట్టు మండపం సమీపంలో ఆదివారం గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహా న్ని పోలీసులు గుర్తించారు. సీఐ మల్లికార్జున్‌రావ్ మాట్లాడుతూ అనారోగ్యం పాలైన వ్యక్తిని ఇంటి వద్ద ఉంచుకోలేక ఎవరికీ తెలియకుండా కొండచుట్టు మండపం సమీపంలో వది లేసి ఉంటారని తెలిపారు. అతను శనివారం రాత్రి మృతిచెంది ఉంటారని పేర్కొన్నారు. అతని ఆచూకీ తెలిసిన వారు 9440796723 నంబరుకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. మృతదేహాన్ని మూ డు రోజులపాటు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచుతామన్నారు.
గాయపడిన వ్యక్తి మృతి
బైరెడ్డిపల్లె : మండలంలోని బైరెడ్డిపల్లె–పుంగనూరు రహదారి లోని ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద నాలుగు రోజుల క్రితం బొలేరో వాహనం ఢీకొనడంతో బైరెడ్డిపల్లెకు చెందిన నజీర్ (70) తీవ్రంగా గాయపడ్డాడు. అత న్ని కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీ ఆస్ప త్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నా రు. వాహనదారులు మద్యం సేవించడంతోపాటు అతివేగంగా వాహనాలను నడపడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


