చిత్తూరు రూరల్ (కాణిపాకం): విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఘటనలో పూర్తి వాస్తవాలను వెలికితీసి, బాధ్యులెవరైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చిత్తూరు నగరంలోని శ్రీకృష్ణ దేవరాయుల బలిజ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి అనేక సందేహాలు తలెత్తుతున్నాయని, వాటిపై ప్రభుత్వం, పోలీసు శాఖ సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. అతని అరెస్ట్ ప్రక్రియ నుంచి మృతి వరకు జరిగిన పరిణామాలపై స్వతంత్ర విచారణ జరిపి, నిజానిజాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టంపై ప్రజలకు విశ్వాసం ఉండాలంటే పారదర్శక దర్యాప్తు చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు. వారి మాటాల్లోనే చూద్దాం..


