అపోలో యూనివర్సిటీ డీన్‌కు జాతీయ అవార్డు | - | Sakshi
Sakshi News home page

అపోలో యూనివర్సిటీ డీన్‌కు జాతీయ అవార్డు

Jun 22 2026 12:18 AM | Updated on Jun 22 2026 12:18 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ది అపోలో యూనివర్సిటీకి చెందిన అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కె.భాస్కర్‌ రెడ్డికి జాతీయ అవార్డు దక్కింది. ఆయన ఔషధ శాస్త్ర పరిశోధన, విద్యా రంగంలో విశిష్ట సేవలకు గాను అసోసియేషన్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ టీచర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏపీటీఐ) – తమిళనాడు శాఖ ప్రతిష్టాత్మక రిసెర్చర్‌ ఇన్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ అవార్డు–2026ను ప్రదానం చేసింది. చైన్నెలోని రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో నిర్వహించిన ‘‘ఎంపవరింగ్‌ ఫ్యూచర్‌ ఫార్మసిస్టిస్‌ త్రూ రీసెర్చ్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ జాతీయ సదస్సులో అవార్డు అందజేశారు. ఈ ఘనతపై ది అపోలో యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. డీన్‌ ప్రొఫెసర్‌ కె.భాస్కర్‌ రెడ్డికి అభినందనలు తెలిపారు.

ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని మృతి

పలమనేరు: రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఇంటర్‌ విద్యార్థిని చికి త్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. పోలీసు ల కథనం మేరకు.. బైరెడ్డిపల్లి మండలం చిన్నపురానికి చెందిన భాస్కర్‌రెడ్డి కుమార్తె హర్షిత(17) పలమనేరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఏమి జరిగిందోకాని రెండు రోజుల క్రితం ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement