కాపు యువకుడికి ఇంత పెద్ద అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం, మా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మౌనం వహించడం బాధాక రం. ఎన్నికల సమయంలో కాపుల గురించి మాట్లాడిన నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? సమాజం ఈ ప్రశ్నకు సమాధానం కోరుతోంది. మాటలు కాదు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. – జైకుమార్,
శ్రీకృష్ణదేవరాయుల బలిజ సభ్యులు, చిత్తూరు
పవన్‌కల్యాణ్ స్పందించాలి
ఎవరు నేరం చేసినా చట్టం ప్రకారం శిక్ష ఉండాలి.. చట్టం ముందు ప్రతి ఒక్కరికీ సమాన రక్షణ లభించాలి. సాయికృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి. ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి రావాలి. లేకుంటే బలిజ సోదరులంతా ఏకమవుతాం. దీనిపై మా పవన్ కల్యాణ్ కూడా స్పందించాలి. జరిగిన అన్యాయంపై నిలదీయాలి.
– దళవాయి బాబు ప్రసాద్, శ్రీకృష్ణదేవరాయుల బలిజ సంఘం, యూత్ ప్రెసిడెంట్, కాజూరు
బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి...
సాయికృష్ణ ప్రాణం తిరిగి రాదు. అతని కుటుంబానికి న్యాయం జరగాలి. అసలు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలియాలి. బాధ్యులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాలి. ఈ ఘటనను కాలగర్భంలో కలిపేయకుండా ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపించాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు.
– దళవాయి సురేష్, శ్రీకృష్ణదేవరాయుల బలిజ సంఘం సభ్యులు, కాజూరు


