కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం

Jun 22 2026 12:18 AM | Updated on Jun 22 2026 12:18 AM

బంగారుపాళెం : మండలంలోని బలిజపల్లె వద్ద ఉన్న చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం కారును ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనదారుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కుప్పం మండలం పైపాళెంకు చెందిన మురుగన్‌ ఒక ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను ద్విచక్ర వాహనంపై బంగారుపాళెం నుంచి పలమనేరు వైపు వెళుతూ బలిజపల్లె వద్ద ముందు వెళ్తున్న కారును ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలో అసస్మారక స్థితిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అతన్ని బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

108 సిబ్బంది నిజాయితీ

అతని వద్ద ఉన్న రూ.55 వేల నగదును ఆస్పత్రి డాక్టర్‌ స్వరూప్‌ సమక్షంలో మురుగన్‌ తమ్ముడు సుధీర్‌కు అందజేశారు. 108 సిబ్బంది నిజాయితీని పలు వురు అభినందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement