గాంధీ రోడ్డులో నిర్మించిన చిన్నపాటి కాలువ (ఫైల్)
గతేడాది ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త
చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్డులో రోడ్డు, కాలువను ప్రారంభించి పది రోజులు కూడా కాలేదు. చిన్నపాటి వర్షానికే గాంధీ రోడ్డు ఓడరేవులా మారిపోయింది. రూ.కోట్లు ప్రజాధనం వెచ్చించి కార్పొరేషన్ అధికారుల స్వీయ పర్యవేక్షణలో ఈ రోడ్డు, కాలువ పనులు చేపట్టారు. గతంలో ఇక్కడ నాలుగు అడుగుల వెడల్పుతో కాలువ ఉండేది. దాని స్థానంలో రెండు అడుగుల కాలువ నిర్మించారు. శనివారం కురిసిన మోస్తరు వర్షానికే కాలువలోని మురుగు మొత్తం రోడ్డుపైకి వచ్చింది. కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడే ‘సాక్షి’ దినపత్రికలో అధికారుల తీరును హెచ్చరించింది. వారు పట్టించుకోలేదు. చిన్నపాటి వర్షానికే కాలువలు పొంగుతూ కొత్తగా నిర్మించిన రోడ్డును కోసేస్తున్నాయి. వర్షాకాలంలో పెద్ద వర్షం పడితే రూ.కోట్ల ప్రజాధనం వర్షార్పణం. – చిత్తూరు అర్బన్


