చైన్‌స్నాచింగ్‌ కేసులో దొంగ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చైన్‌స్నాచింగ్‌ కేసులో దొంగ అరెస్టు

Jun 21 2026 6:16 AM | Updated on Jun 21 2026 6:16 AM

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని ద్వారకానగర్‌లో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ఎస్‌.దొరైరాజ్‌ (45) అనే నిందితుడిని అరెస్టు చేసినట్టు సీఐ నెట్టింకటయ్య తెలిపారు. ఆయన శనివారం చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు వివరాలను వెల్లడించారు. గతనెల 27వ తేదీన ద్వారకానగర్‌లో ఓ వృద్ధురాలు ముగ్గువేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లిపోయాడన్నారు. దీనిపై కేసు నమోదుచేసి సాంకేతిక ఆధారాలతో తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన దొరైరాజ్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు. అతని నుంచి రూ.39 గ్రాముల బంగారు చైను, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ మారెప్ప, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement