ఈ అబ్బాయి ఎవరో..? | - | Sakshi
Sakshi News home page

ఈ అబ్బాయి ఎవరో..?

Jun 20 2026 12:13 AM | Updated on Jun 20 2026 12:13 AM

బంగారుపాళెం: ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిపేరు దిలీప్‌ అని చెబుతున్నాడు. శుక్రవారం రాత్రి మండలంలోని మొగిలి ఘాట్‌లోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంటే స్థానికులు అబ్బాయి వివరాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన పేరు దిలీప్‌ అని చెబుతున్నాడనిని, తల్లిదండ్రుల పేరు, ఊరు పేరు వంటి వివరాలు తెలియదని చెబుతున్నాడని స్థానికులు తెలిపారు. దీంతో అ అబ్బాయిని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి అప్పగించారు. పోలీసులు అ అబ్బాయి చిరునామా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అబ్బాయి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీసులకు తెలపాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement