బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పవన్ కళ్యాణ్ మౌనం ఎందుకని నిలదీత
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సాయికృష్ణ ఎక్కడ? అని కాపు సంఘాల నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజికవర్గంపై వేధింపులు, లక్ష్యంగా చేసుకునే ఘటనలు పెరుగుతున్నాయని బలిజ సంఘ నాయకులు ఆరోపించారు. చిత్తూరు నగరం గంగినేనిపార్కులోని శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం వద్ద శుక్రవారం శ్రీకృష్ణదేవరాయుల బలిజ సంఘ ఆధ్వర్యంలో సాయికృష్ణ మృతికి నిరసన వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ పోలీసుల కస్టడీలోకి వెళ్లిన తర్వాత దాదాపు నెల రోజులైనా అతని ఆచూకీ లభించలేదని, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కాపు సమాజాన్ని కలవరపెడుతోందని పేర్కొన్నారు. సాయికృష్ణ ఆచూకీని వెంటనే వెల్లడించి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అప్పోజి, ఉపాధ్యక్షులు ఎన్‌వీ రమణ, అధికార ప్రతినిధి మధురాయల్, నాయకులు జయపాల్, జనార్థన్, శ్రీనివాసులు, చల్లా గిరి పాల్గొన్నారు. మరికొంత మంది నాయకులేమన్నారంటే.. వారి మాటాల్లోనే..
కాపు యువకుడి అదృశ్యంపై ఆందోళన


