అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Jun 20 2026 12:13 AM | Updated on Jun 20 2026 12:13 AM

● రూ 27.80 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం ● చొరీకి ఉపయోగించిన వాహనలు సీజ్‌

● రూ 27.80 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం ● చొరీకి ఉపయోగించిన వాహనలు సీజ్‌

బంగారుపాళెం: పగటిపూట ఇళ్లల్లో చోరీలకు పాల్పడే అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను శుక్రవారం అరెస్టు చేసినట్టు పలమనేరు డిఎస్పీ డేగల ప్రభాకర్‌, బంగారుపాళెం సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పలమనేరు, బంగారుపాళెం మండలాల్లోని ఇళ్లల్లో జరిగిన చోరీలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంగారుపాళెం సీఐ కత్తి శ్రీనివాసుల పర్యవేక్షణలో పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పక్కాగా అందిన సమాచారం మేరకు బంగారుపాళెం మండలం పాలేరు అండర్‌ బ్రిడ్జి సమీపంలో ఎస్‌ఐ ప్రసాద్‌, సిబ్బందితో కలసి వాహనాలు తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాల్లోని గ్రామాల్లో పగటిపూట సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితులు అంగీకరించారరు. బంగారుపాళెం మండలంలోనిగౌరీపురం,వెలుతురుచేను, రాగిమానుపెంట, పలమనేరు మండలంలో కరిడిమడుగు, చిన్నకుంట, కాలువపల్లె గ్రామాల్లో జరిగిన ఆరు చోరీ కేసులు ఛేదించినట్లు డీఎస్పీ, సీఐ తెలి పారు. తమిళనాడు రాష్ట్రం వాణియంబాడికి చెందిన గాడ్విన్‌మోసెస్‌, మురుగన్‌, విఘ్నేష్‌ను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 181.5 గ్రాముల బంగారు ఆభరణా లు, 307 గ్రాములు వెండి ఆభరణాలు, చోరీలకు విని యోగించిన కారు, స్కూటీలను స్వాధీనం చేసుకున్న ట్లు తెలిపారు. కేసు ఛేదించిన పోలీసులను ఎస్సీ అభినందించి, నగదు రివార్డును ప్రకటించినట్లు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement