సాయికృష్ణ ఘట నలో బాధ్యులైన పోలీసు అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకృష్ణదేవరాయుల బలి జ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర డీజీపీ, సంబంధిత ఐజీ, ఎస్పీ, ఏసీపీతో పాటు ప్రభుత్వ పెద్దల బాధ్యతను కూడా విచారించాలి. ఒక వ్యక్తి కనిపించకుండా పోయినప్పుడు వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సింది. ఆలస్యం ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలి. సాయికృష్ణ కుటుంబం జనసేన పార్టీకి మద్దతుదారులేనని, అలాంటి కుటుంబానికి ఇంత పెద్ద కష్టం వచ్చినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరం.
– అప్పొజి, శ్రీకృష్ణదేవరాయల
బలిజసంఘ అధ్యక్షుడు, చిత్తూరు
ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు
సాయికృష్ణను పోలీ సులు స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు పలుమార్లు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆచూకీ అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అక్కడ సీఐ, ఎస్‌ఐతో పాటు ఇతర సిబ్బంది కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. సాయికృష్ణ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు పిటిషన్‌న్ విచారణకు స్వీకరించినప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన స్పందన కనిపించడం లేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. – మధురాయల్, శ్రీకృష్ణదేవరాయల బలిజసంఘ సంఘ అధికార ప్రతినిధి


