బ్రిటిష్ పాలనను గుర్తు చేసేలా థర్డ్ డిగ్రీ పద్ధతులు కొనసాగుతున్నాయి. సాయికృష్ణ బతి కున్నాడా? లేక ఏమైనా జరిగిందా? ఏది నిజమో ప్రభుత్వం చెప్పాలి. కనీసం అతని ఆచూకీ తెలియజేయాలి. సాయికృష్ణ కుటుంబ సభ్యులు కోరిక మేరకు మృతదేహాన్ని అప్పగించాలి. సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాలి. న్యాయంగా దర్యాప్తు చేపట్టాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమష్టిగా ఆందోళనలు చేపడతాం. – జయపాల్, బలిజ సంఘం నేత, చిత్తూరు
దురదృష్టకరం
సామాన్య పౌరుడైన ఒక కాపు యువకుడికి ఇంతటి అన్యాయం జరుగుతున్నా, సీఎం చంద్రబాబు కనీసం స్పందించకపోవడం దురదృష్టకరం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తాం. ఆయన ఒక సామాన్య పౌరుడికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థ కావడంలేదు. ఈ విషయంలో పట్టించుకోకుంటే బలిజ సంఘ నేతలంతా ఏకమవుతాం. – ఎన్‌వీ రమణ, సంఘ నేత, చిత్తూరు


