సాయం అందక.. సాగు సాగక..! | - | Sakshi
Sakshi News home page

సాయం అందక.. సాగు సాగక..!

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

29,462 మంది రైతులకు షాక్‌

ఈకేవైసీ, కుటుంబ సర్వే సమస్యతో

అనర్హత

గత మూడు విడతల్లో 2.05 లక్షల

మందికి.. నేడు 1.78 లక్షలకే పరిమితం

కాణిపాకం: ఆర్థిక భారం పేరుతో కూటమి ప్రభు త్వం అన్నదాత సుఖీభవ పథకంలో భారీగా కోత లు పెట్టింది. గత మూడు విడతల్లో రెండున్నర లక్షలకు చేరువలో ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఒక్కసారి గా జిల్లాలో 29,462 మంది తగ్గిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత మూడు విడతల వరకు 2,05,753 మంది రైతులు పథకం ప్రయోజనం పొందగా.. 2026 మొదటి విడతలో ఆ సంఖ్య 1,78,622కు పడిపోయింది. దీంతో వేలాది మంది రైతులు తమ పేర్లు జాబితాలో లేకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక కారణాలే ఎక్కువగా రైతులను అనర్హులుగా మార్చినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు రూ.5 వేల చొప్పున అందజేస్తోంది. 2026 మొదటి విడతలో జిల్లాలో అర్హులైన 1,78,622 మంది రైతులకు రూ.89.311 కోట్లు జమ కానున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ పథకం కింద 1,42,109 మంది రైతులకు రూ.2 వేల చొప్పున రూ.28.422 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే జిల్లాలో వేలాది మంది రైతులు అన్నదాత సుఖీభవకు దూరం కావడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబ సర్వేనే ప్రధాన అడ్డంకి

అనర్హుల జాబితాలో అత్యధికంగా 11,714 మంది కుటుంబ సర్వేలో వివరాలు లేకపోవడం వల్ల బయటపడటం గమనార్హం. ఆ తర్వాత తహసీల్దార్‌ ఽధ్రువీకరణ పెండింగ్‌లో ఉన్న 8,615 మంది, ఈకేవైసీ తిరస్కరణ పొందిన 6,940 మంది రైతులు ఉన్నా రు. రైతులు ప్రభుత్వానికి అవసరమైన వివరాలను సమయానికి నమోదు చేయకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమైందని అధికారులు చెబుతున్నారు.

రైతుల్లో ఆందోళన

గత మూడు విడతల్లో పథకం ప్రయోజనం పొందిన వేలాది మంది రైతులకు ఈసారి డబ్బులు జమ కాకపోవడంతో వారు మండల వ్యవసాయ కార్యాలయా లు, రైతు సేవా కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆరా తీస్తున్నారు. తమ పేర్లు ఎందుకు తొలగించారో తెలియక అయోమయంలో ఉన్నారు. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో జాబితా నుంచి తప్పించారని పలువురు రైతులు వాపోతున్నారు.

విడతల వారీగా లబ్ధిదారులు

దశ అర్హుల సంఖ్య జమ చేసిన/

చేయనున్న మొత్తం

(రూ.కోట్లు)

మొదటి విడత 2,05,753 102.88

రెండో విడత 2,05,753 102.88

మూడో విడత 2,05,753 82.30

నాలుగో విడత 1,78,622 89.311

స్వేదాన్ని చిందించి..ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసే కర్షకుడికి కష్టమొచ్చింది. సహకరించని ప్రకృతి..వర్షాభావం..అకాల వర్షాలు..గిట్టుబాటుగాని ధరలు..వెరసి రైతన్న నష్టపోతున్నాడు. పంట సాగుకు అప్పులు చేస్తాడు.. పంట చేతికందక కుంగిపోతున్నాడు.. చేయూత నివ్వాల్సిన సర్కారు సాయం అందించడలో మీనమేషాలు లెక్కిస్తోంది. సాంకేతిక కారణాలు చూపి కోతలు విధిస్తోంది. ఫలితంగా అన్నదాత పుడమికి దూరమవుతున్నాడు.. వలసలు పోతున్నాడు. ఇదీ చంద్రబాబు సర్కారులో దుస్థితి.

అన్నదాత సుఖీభవలో

భారీ కోతలు!

సాంకేతిక కారణాలతోనే కోతలు

అనర్హుల జాబితాను పరిశీలిస్తే ఎక్కువ మంది రైతులు సాంకేతిక కారణాలతోనే పథకానికి దూర మయ్యారు. బ్యాంకు ఖాతాలకు ఎన్‌పీసీఐ లింక్‌ లేకపోవడం, ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, కుటుంబ సర్వేలో వివరాలు నమోదు కాకపోవడం, తహసీల్దార్‌ స్థాయిలో ధ్రువీకరణ పెండింగ్‌లో ఉండడం తదితర కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎన్‌పీసీఐ ఇన్‌యాక్టివ్‌ సమస్యతో 963 మంది, ఎన్‌పీసీఐ లింక్‌ కానివారు 1,213 మంది, ఈకేవైసీ పెండింగ్‌ 17 మంది, ఈకేవైసీ తిరస్కరణ 6,940 మంది, తహసీల్దార్‌ పరిశీలనలో 8,615 మంది, కుటుంబ సర్వేలో పేరు లేనివారు 11,714 మందికాగా మొత్తం అనర్హులు 29,462 మందిగా తేలారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement