రొంపిచెర్ల : వైఎస్సార్ సీపీ బాధితులకు అండగా ఉంటుందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరె డ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రొంపిచెర్ల, బొమ్మయ్యగారిపల్లె, చల్లావారిపల్లె గ్రామా ల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. కూ టమి బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవస రం లేదన్నారు. తనకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం గెర్లపల్లెలో వైఎస్సార్‌సీపీ నేత మోహన్‌రెడ్డి ద్విచక్ర వాహనాన్ని దుండగులు ఎలా దగ్ధం చేశారని అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాజారెడ్డిని పరామర్శించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. పాళ్యెంవీధిలో మృతి చెందిన సాయిపీర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే పెద్దకురవపల్లెలో శంకర్ ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డిశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సలీంబాషా, కరీముల్లా, బి.మోహన్‌రెడ్డి, కోటా వెంకటరమణ, బావాజీ, మహబుబ్‌బాషా, ప్రశాంత్‌రెడ్డి, గురు, ఓబులేసు, యర్రంరెడ్డి, దుర్గప్రసాద్ రెడ్డి, జగదీష్, ఆనంద్, సుబ్బన్న, కరుణాకర్, శంకర్, కిషోర్, నాగయ్య, హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మా భూమిని మార్చేశారని ఫిర్యాదు
‘మా పేరుతో ఉన్న భూమిని తహసీల్దార్ ఇతరుల పేర్లతో మార్చేశారు’ అని బాధితుడు సోమశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. గానుగచింత పంచాయతీ జగడంవారిపల్లె కు చెందిన రెడ్డెప్పరెడ్డి పేరుతో సర్వే నంబర్ 658–2లో 50 సెంట్ల భూమికి 2014లో పట్టా మంజూరు చేశారు. అలాగే 665లో 23 సెంట్లు భూమి తమ తాత చిన్న రెడ్డెప్ప రెడ్డి పేరుతో ఉందన్నారు. ఈ రెండు సర్వే నంబర్లలో ఉన్న భూమిని ఇన్‌చార్జి తహసీల్దార్ డబ్బు తీసుకుని గ్రామానికి చెందిన కొందరి పేరుతో ఆన్‌లైన్ చేసి ఇచ్చారని చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు, ఆర్డీఓకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కలెక్టర్, ఆర్డీఓ తహసీల్దార్‌ను ఆదేశించినా ఖాతారు చేయడం లేదన్నారు. భూమి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. భూమి వద్దకు వెళ్లితే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పారు. దీనిపై విచారణ జరి పి, న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. పేదలకు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధించిన రెవెన్యూ, పోలీసు అధికారులను వదిలే ప్రపక్తే లేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఏకపక్షంగా పని చేసిన అధికారులు రాబోవు కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.


