శ్రీవారి దర్శనానికి 24 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

– 8లో

తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండాయి.

కిలోకి రూ.18 చెల్లించాలి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని మామిడి రైతులకు ప్ర భుత్వం ప్రకటించిన రూ.4 గిట్టుబాటు ధరతోపాటు, గుజ్జు ఫ్యాక్టరీల నుంచి తాము డిమాండ్‌ చేస్తున్న రూ.14 ధరను కలిపి మొత్తం రూ.18 చెల్లించేలా చర్య లు చేపట్టాలని మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షు డు మునీశ్వర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘ నాయకులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2026 సంవత్సరానికిగాను తోతాపురి మామిడి రైతులకు కిలోకి రూ.4 చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని ప్రకటించడం హర్షణీయమన్నారు. అయితే జిల్లాలోని గుజ్జు ఫ్యాక్టరీలు, ర్యాంపులు అధికారికంగా ఏ ధరకు కొంటున్నాయో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. గ త ఏడాది తప్పులు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. 2025లో ప్రభుత్వం రూ.4 ప్రకటించినప్పటికీ, గుజ్జు ఫ్యాక్టరీలు కనీస ధర రూ.8 అమలు చేయకుండా రైతులను నష్టపరిచాయన్నారు. ఆయా ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 50 నుంచి 60 శాతం తోతాపురి మామిడికాయలు ఫ్యాక్టరీలకు, ర్యాంపులకు సరఫరా అయిపోయాయన్నారు. ఇ ప్పుడు ప్రభుత్వం ఆలస్యంగా స్పందించడంతో రూ.4 సబ్సిడీ కోసం ఫ్యాక్టరీల డేటాపైనే ఆధారపడాల్సి వ స్తుందన్నారు. ఆ డేటాను ఎలా ప్రామాణికంగా తీసుకుంటారో స్పష్టం చేసి, నిజమైన రైతు నష్టపోకుండా చూడాలన్నారు. మామిడి పంటను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేస్తే కూలీల ఖర్చుల రూపంలో రైతులకు జరిగే నష్టాన్ని కొంతవరకై నా తగ్గించాలని కోరారు. నెల రోజులుగా రైతులు టోకెన్లు దొరక్క గు జ్జు ఫ్యాక్టరీల వద్ద, ర్యాంపుల వద్ద నానా అవస్థలు ప డుతుంటే జిల్లాలోని ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకోలేదని చెప్పారు. మామిడి రైతు సంఘం ప్రతినిధులు హేమలత, త్యాగరాజ రెడ్డి, చంగల్‌ రాయ రెడ్డి, మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement