కుప్పం: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్‌ను ద్రవి డ వర్సిటీ వైస్ చాన్సలర్ మల్లయ్య శుక్రవారం విజయవాడలో కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీలో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పట్టాల పంపిణీకి స్నాతకోత్సవం నిర్వహణకు ఆయనను ఆహ్వానించారు. అంతేకాకుండా వర్సిటీ చేపడుతున్న అకడమిక్, వర్సిటీ, పరిశోధనల విష యాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ కిరణ కుమార్ పాల్గొన్నారు.
జిల్లా అడిషనల్ ఎస్పీగా
షాను బాధ్యతల స్వీకారం
చిత్తూరు అర్బన్: రాష్ట్ర పోలీసు శాఖ సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా అడిషనల్ ఎస్పీగా బదిలీపై వచ్చిన ఎస్.షాను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ తుషా ర్ డూడిను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగు చ్ఛం అందజేశారు. ఎస్.షాను 2007లో బీటెక్ పూర్తి చేసి, 2018 బ్యాచ్ డీఎస్పీగా పోలీసు శాఖ లో చేరారు. విధి నిర్వహణలో భాగంగా నార్త్ విజయవాడ ఏసీపీగా, తిరుపతి రైల్వే డీఎస్పీగా పనిచేసి పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. ఇటీవల డీఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీగా పదో న్నతి పొందిన ఆమె, చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.


