మీరు భయపడాల్సిన పనిలేదు! | - | Sakshi
Sakshi News home page

మీరు భయపడాల్సిన పనిలేదు!

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

● రాజకీయపార్టీల ఒత్తిళ్లకు తలొగ్గొద్దు ● కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ

బీఎల్‌వోలు నిజాయితీగా

విధులు నిర్వహించండి

చిత్తూరు కలెక్టరేట్‌ : సర్‌ ప్రక్రియలో బీఎల్‌వోలు నిజాయితీగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని 11వ వార్డులో ఓ పీఏ సర్‌ ప్రక్రియ విధుల్లో ఉన్న బీఎల్‌వోలను బెదిరించిన విషయం పై కలెక్టర్‌ స్పందించారు. బీఎల్‌వోలు ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. చిత్తూరు నగరంలోని 11వ వార్డు సమస్య పై బీఎల్‌వోలు తనకు నేరుగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానన్నారు. బీఎల్‌వోలకు ఏవైనా సమస్యలుంటే నేరు గా తనకు చెప్పుకోవచ్చని తెలిపారు.

ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్‌ ఫారం..

ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్‌ ఫారం అందజేసి, వారి ద్వారా పూర్తి చేయించిన తర్వాతే ఆన్‌న్‌లైనన్‌లో వివరాలను అప్‌డేట్‌ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 13.4 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 4.5 లక్షల ఎన్యుమరేషన్‌ ఫారాలను పంపిణీ చేశామని చెప్పారు. ప్రతి ఇంటికి బీఎల్‌ఓలు కనీసం మూడుసార్లు వెళ్తారని, ఒకవేళ ఇల్లు తాళం వేసి ఉంటే ఫారం కాపీని ఇంటి లోపల వేసి వస్తారన్నారు. బీఎల్‌ఓలు రాజకీయ పార్టీల కార్యాలయా ల్లో ఫారాలు పంపిణీ చేయడం తీవ్రమైన తప్పు అని కలెక్టర్‌ మండిపడ్డారు. తాజాగా పలమనేరులో జరిగిన ఘటనలపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జూలై 14 లోపు ఆన్‌లైన్‌ అప్‌డేట్‌

ఓటర్లు తమ ఫారాల్లో వివరాలన్నీ నింపి తిరిగి బీఎల్‌ఓలకు అందజేయాలని కలెక్టర్‌ వెల్లడించారు. జూ లై 14వ తేదీ లోపు ఈ వివరాలన్నింటినీ బీఎల్‌ఓ యాప్‌లో అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుందన్నారు.

ప్రతి సోమవారం సమావేశాలు

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రతి సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కలెక్ట ర్‌ తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఏ సమస్య ఉన్నా రాజకీయ పార్టీల నాయకులు నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

వంద శాతం పారదర్శకంగా ప్రక్రియ

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను 100 శాతం పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ స్పష్టం చేశారు. గతంలో నిర్వహించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌) తరహాలోనే ఈ ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పారు. 2002 ఓటర్ల జాబితాతో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుపుతున్నా మని తెలిపారు. ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ లోపు బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సర్‌ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. జూలై 14 వ తేదీన పోలింగ్‌ కేంద్రాల పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందన్నారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్‌లైములు, ఆక్షేపణలు స్వీకరణ ఉంటుందన్నారు. జూలై 21 నుంచి సెప్టెంబర్‌ 18వ తేదీ వరకు క్‌లైమ్‌లు, ఆక్షేపణలపై విచార ణ చేయడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితా ఉంటుందని వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement