రవి కిడ్నాప్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! | - | Sakshi
Sakshi News home page

రవి కిడ్నాప్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌!

Jun 19 2026 1:24 AM | Updated on Jun 19 2026 1:24 AM

● కిడ్నాప్‌ చేసింది కడప టీడీపీ బ్యాచ్‌ ● కర్ణాటకలో ప్రధాన నిందితుడి అరెస్ట్‌

● కిడ్నాప్‌ చేసింది కడప టీడీపీ బ్యాచ్‌ ● కర్ణాటకలో ప్రధాన నిందితుడి అరెస్ట్‌

పలమనేరు: గంగవరానికి చెందిన ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ వ్యాపారి రవి కిడ్నాప్‌ కేసులో అనేక టిస్టులు వెలుగుచూస్తున్నాయి. ఈ కిడ్నాప్‌ కేసులో వెఎస్సార్‌ కడప జిల్లా సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామానికి చెందిన టీడీపీ నేత ఉప్పలూరు గోవిందరెడ్డి కుమారుడు నాగేశ్వర్‌రెడ్డి, అతని అనుచరుల హస్తం ఉన్నట్టు తెలిసింది. అదే గ్రామానికి చెందిన పలువురు అతనిపై అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. గంగవరానికి చెందిన రవి గత ఆదివారం గ్రామంలో జరిగిన గంగజాతరకు వచ్చి కిడ్నాప్‌నకు గురైన విషయం తెల్సిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది. ఇతను టీడీపీ నేత కుమారుడు కాబట్టి ఎలాగైనా ఇతన్ని తప్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది.

బిగ్‌ ట్విస్ట్‌

ఇలా ఉండగా రవిని కిడ్నాప్‌ చేసింది వైఎస్సార్‌ కడప జిల్లా సింహాద్రి పురానికి చెందిన నాగేశ్వరరెడ్డిగా సమాచారం. ఇక్కడ జరిగిన కిడ్నాప్‌ విషయం తెలిసి ఆ గ్రామానికి చెందిన కొందరు అక్కడి పోలీసులకు నిందితుని నేరచరిత్రను తెలిపినట్టు తెలిసింది. దీంతో అతని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో దేవనహళ్లిలో ఇతను పట్టుబడడంతో కిడ్నాప్‌ విషయంలో అసలు వాస్తవాలు బయటపడనున్నాయి.

ఏటీఎం ట్యాంపరింగ్‌లపై 20 కేసులు

గతంలో నాగేశ్వరరెడ్డి ఏటీఎం ట్యాంపరింగ్‌లు, హ్యాకింగ్‌ ద్వారా కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్టు సమాచారం. అంతెందుకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మాజీ మంత్రి బంధువుల ఖాతా నుంచి భారీగా డబ్బులు కొట్టేసినట్టు తెలిసింది. ఇతన్ని ఓ కేసులో ఎలాగైనా పట్టుకోవాలని పులివెందుల ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి ప్రయత్నించగా ఎస్‌ఐ కారునే గుద్ది చంపాలని ప్లాన్‌ చేసినట్టు తెలిసింది. ఇంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి టీడీపీ నాయకుని కుమారుడు కావడంతో రవి కిడ్నాప్‌ కేసులో న్యాయం జరుగుతుందా లేదా అనే విస్మయం కలుగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement