మా ఓటు ఉందా లేదా..? అంటూ ఓటర్లు తమ ఓటు హక్కును ఆతృతగా చూసుకున్న ఘటన గుడిపాల మండలంలో చోటు చేసుకుంది. బుధవారం మండలంలోని 197రామాపురంలో చాలామంది ఓటర్లు తమ ఓటుహక్కు ఉందా, తమకు ఎన్యుమరేషన్ పత్రాలు వచ్చాయా లేదా..? అని బీఎల్‌ఓల వద్ద సరి చూసుకోవడం కనిపిచింది. టీడీపీ మైయాప్ ద్వారా ఓటర్ల తొలగింపు కార్యక్రమం జరుగుతోందని భావిమచిన ఓటర్లు అప్రమత్తమయ్యారు. దీనికితోడు ప్రతి బూత్‌స్థాయిలో వైఎస్సార్‌సీపీకి సంబంధించిన బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండి బీఎల్‌ఓల సహకారంతో ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ పత్రాలను అందజేస్తున్నారు.
– గుడిపాల


