– 8లో
– 8లో
న్యూస్‌రీల్
బతుకు క్లోజ్!
అభాగ్యుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. కొత్త పింఛన్లు ఇవ్వక పోగా..ఉన్న పింఛన్లను తీసేస్తోంది.
జిల్లా సమాచారం
ప్రయివేటు ఇంటర్మీడియెట్ కళాశాలల్లో అడ్డగోలు దోపిడీ
బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026
మధ్య తరగతి తండ్రి రామయ్య ముఖంలో నెత్తురు చుక్కలేదు. చేతిలో ఉన్న కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీ ఫీజు స్ట్రక్చర్ పేపర్ వైపు చూస్తుంటే ఆయనకు కళ్లు తిరుగుతున్నాయ్. ట్యూషన్ ఫీజు, ఏసీ, స్టడీ మెటీరియల్, స్పెషల్ కోచింగ్, హాస్టల్, బస్సు ఫీజు చివరకు ల్యాబ్ ఫీజు ఇలా ఒకటేమిటి, ఒకే ఒక్క ఏడాదికి రెండులక్షల రూపాయాలు!. పదో తరగతిలో కొడుకు మంచి మార్కులతో పాసయ్యాడని సంబరపడాలో.. లేక ఈ ఫీజుల భారాన్ని మోయలేక చేతులెత్తేయాలో అర్థంగాక రామయ్య నెత్తిన చేయి పెట్టుకుని కూర్చున్నాడు.
...ఇది కేవలం ఒక్క రామయ్య బాధే కాదు. జిల్లాలోని లక్షలాది మంది పేద తల్లిదండ్రుల ఆవేదన, ఆక్రోశం. గత ప్రభుత్వంలో ప్రభుత్వ విద్య బలోపేతం కాగా.. ఈ కూటమి ప్రభుత్వంలో కార్పొరేట్‌కు కొమ్ముకాస్తోంది. ఫీజుల నిబంధనలు కఠినతరం చేయకుండా చోద్యం చూస్తోంది. ఇదే అదునుగా ప్రయివేటు ఇంటర్మీడియెట్ కళాశాలలు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. ఈ ఏడాది అధికంగా 30 శాతం వరకు అధిక ఫీజులు వసూలు చేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఫీజుల దోపిడీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
రసాయన ఎరువులు వద్దు
పలమనేరు: పంటలకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని కలికిరి కృషి విజ్ఞానకేంద్రం ప్రిన్సిపల్ లక్ష్మీప్రసన్న సూచించారు. మండలంలోని కూర్మాయి గ్రామంలో కేత్ బచావో కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకంతో భూములు నిస్సారంగా మారిపోతాయన్నారు. వీటకి ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులైన జీలుగ, జనుము, పచ్చరొట్ట ఎరువులను వాడాలన్నారు. అనంతరం అజిటోబక్టర్, రైజోబియం, నానో ఎరువులపై ఆమె రైతులకు వివరించారు. స్థానిక ఏవో సంధ్య మాట్లాడుతూ ఇకపై రైతులకు ఎరువులు కావాలంటే ఏపీఏఎంఎస్ యాప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సైంటిస్ట్ నీలిమ సాహేబ్, మాధవి, ఆర్‌ఎస్‌కే సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
15 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 91,478 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,376 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.15 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటా యించిన సమయానికంటే ముందు వెళ్లిన వారి ని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
మహిళా వర్సిటీలో పలు
కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి రూరల్: శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీలో 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత గల అభ్యర్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ కోర్సు ఇన్ పల్లియేటివ్ కేర్, పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డిప్లొమా ఇన్ యోగా, పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థినులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 15 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య పి. సువర్ణలతా దేవి తెలిపారు. కోర్సుల అర్హతలు, ఫీజు వివరాలు, దరఖాస్తు విధానం తదితర పూర్తి సమాచారాన్ని విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో పొందవచ్చని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వ కళాశాలలు 29
ఏపీ మోడల్ స్కూల్స్ 07
ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు 77
ఏపీఆర్‌జేసీ, ఏపీఎస్‌డబ్ల్యూఆర్ 05
హైస్కూల్ ప్లస్ 29
ప్రభుత్వ, ప్రైవేట్ ఒకేషనల్ 12
కేజీబీవీ 08
చిత్తూరు కలెక్టరేట్ : విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. కళాశాల ఫీజులు, యూనిఫాం, పుస్తకాలు, బస్ ఫీజులు వంటివి తడిసి మోపెడవడంతో ఎలా చదివించాలని తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం మరిన్ని విద్యాసంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రైవేట్ కాలేజీల్లో తగిన వసతులు, ఆటస్థలాలు లేకపోయినా భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు.
నిబంధనలు తూచ్
ప్రభుత్వాలు, విద్యాశాఖలు ఫీజుల నియంత్రణకు ఎన్ని జీవోలు తెచ్చినా.. హెచ్చరికలు జారీ చేసినా కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే నాలుగైదు రెట్లు అదనంగా వసూలు చేయడం రివాజుగా మారుతోంది. ఈ సారి ప్రతి తరగతికి దాదాపు 30 శాతం వరకు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫీజులకు సంబంధించిన రశీదుల్లో సగం మొత్తమే చూపిస్తూ, మిగిలిన మొత్తాన్ని ఇతర ఫీజుల పేరిట నల్లధనంగా మార్చడం చేస్తున్నారు.
వెనుకబడుతున్న ప్రభుత్వ కళాశాలలు
జిల్లాలోని 29 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సరైన సదుపాయాలు, ల్యాబ్స్, లెక్చరర్లు లేరు. అరకొర వసతులు, అన్ని సబ్జెక్ట్‌లు బోధించే అధ్యాపకులు లేరు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ఇదే అదునుగా జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు గ్రామాల్లో సైతం ప్రైవేట్ కళాశాలలు వెలుస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఎంసెట్, నీట్ పేరుతో దోచుకుంటున్నాయి. ఇలా ఏడాదికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.80 వేల నుంచి రూ.3.5 లక్షల వరకు గుంజుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌న్‌మోహన్ రెడ్డి హయాంలో మనబడి నాడు–నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం మానేసింది.
విపత్తు!
పీఎం కుసుమ్ పనులకు శ్రీకారం చుట్టాలి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో పీఎం కుసుమ్ పనులను ప్రారంభించాలని ఇంధనశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయానంద్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి ట్రాన్స్‌కో ఎస్‌ఈలతో సమావేశమయ్యారు. జిల్లా లో జరుగుతున్న పనుల గురించి ఎస్‌ఈ అమర్‌బాబు వివరాలను వెల్లడించారు. చిత్తూరు అర్బన్, రూరల్ డివిజన్ల పరిధిలో 80 మెగావాట్ల సోలార్ కేంద్రం కోసం 295 ఎకరాలను గుర్తించామన్నారు. బంగారుపాళ్యం, ఆవులకొండ, యాద మరి, చిత్తూరు మండలాల్లో మొత్తం 18 ప్రాంతాలు గుర్తించామన్నారు. కుప్పం నియోజకవర్గంలో 141 మెగావాట్ల సోలార్ యూనిట్ల ఉత్పత్తి కేంద్రం కోసం 520 ఎకరాలు గుర్తించినట్టు పేర్కొన్నారు. దీనికోసం ఐదు మండలాల్లో 26 ప్రాంతాలను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. చిత్తూరు అర్బన్, రూరల్స్ డివిజన్ల పరంగా సోలార్ యూనిట్ కోసం టెండర్ పనులు పూర్తయ్యాయని, ఒక మెగావాట్ సోలార్ కేంద్రం ఏర్పాటుకు రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు.
నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈనెల 21న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్‌వో మోహన్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 21వ తేదీన (ఆదివారం) జరగనున్న నీట్ – 2026 ప్రవేశ పరీక్షకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పరీక్షకు 1,111 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. వీరి కోసం జిల్లా కేంద్రంలో మూడు కేంద్రాలు (పీవీకేఎన్, సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలు, లిటిల్ ప్లవర్ పాఠశాలను) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి స్థాయిలో వీడియో గ్రఫీ, ఫొటోగ్రఫీ చేయనున్నట్లు తెలిపారు. నోడల్ అధికారి డా.జీవనజ్యోతి, చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కులశేఖర్, టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య, డీఈవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
హాజరైన అధికారులు మాట్లాడుతున్న డీఆర్‌వో మోహన్‌కుమార్
ఎడాపెడా ఫీజుల
మోత
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయ్. అనుమతించిన ఫీజులకంటే అదనంగా వసూ లు చేసే కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. అపార్ట్‌మెంట్, కనీస భద్రతా ప్రమాణాలు లేని భవనాల్లో కాలేజీలు నడిపితే యాజమాన్యాలకు నోటీసులు జారీచేస్తాం. ఫీజుల దోపిడీపై తల్లుదండ్రులు ధైర్యంగా మా కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.
– రఘుపతి, డీఐఈవో, ఇంటర్మీడియెట్ శాఖ
జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు పలు రకాలుగా ఉన్నాయి. కళాశాలకు ఉన్న పేరును బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి వంటి పట్టణాల్లో పేరున్న కళాశాలలు ఏడాదికి ఫీజు రూపంలో రూ.90 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అలాగే హాస్టల్‌కు రూ.లక్ష, బస్ చార్జీలు దూరాన్ని బట్టి రూ.30 వేలు, బుక్స్‌కు రూ.20 వేలు, యూనిఫామ్ రెండు జతలకు రూ.10 వేలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో ఫీజు రూ.60 వేలు, బస్ ఫీజు రూ.18 వేలు, యూనిఫామ్ రూ.2,500, బుక్స్‌కు రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను చదివించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది.


