ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం
44,268 హెక్టార్లు
వేరుశనగ సాధారణ విస్తీర్ణం
21,903 హెక్టార్లు
జిల్లాకు కేటాయించిన వేరుశనగ విత్తనాలు
27,000 క్వింటాళ్లు
ఇప్పటి వరకు జిల్లాకు చేరింది
2,600 క్వింటాళ్లు
పంపిణీ జరిగిన ప్రాంతాలు: కుప్పం,
పలమనేరు నియోజకవర్గాల్లో మాత్రమే
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఖరీఫ్‌నకు వేరుశనగ విత్తనం దొరకనంటోంది. ఏరువాక పౌర్ణమి సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి విత్తనాలు అందకపోవ డంతో రైతులు వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జిల్లాలో ఖరీఫ్ సీజనన్‌లో వర్షాధార వ్యవసాయం ఎక్కువ. ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 44,268 హెక్టార్లు కాగా, అందులో 21,903 హెక్టార్లలో వేరుశనగ సాగు చేయనున్నారు. గతేడాది 7వేల హెక్టార్లకే సాగు పరిమితమైంది. దీనికారణంగా గతేడాది కూడా విత్తనాల పంపిణీ ఆలస్యమైంది. ఈసారి కూడా అదే పరిస్థితి తలెత్తుతోంది.
కేటాయింపులు ఘనం..
పంపిణీ నామమాత్రం
ఖరీఫ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాకు 27 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించారు. కానీ ఇప్పటివరకు జిల్లాకు చేరింది 2,600 క్వింటాళ్లు మాత్రమే. మిగిలిన విత్తనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. జిల్లాకు వచ్చిన కొద్దిపాటి విత్తనం కూడా అన్ని మండలాలకు చేరలేదు. ప్రధానంగా కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకే పరిమితమైంది. చిత్తూరు, గంగాధరనెల్లూరు, నగరి, పూతలపట్టు నియోజకర్గాలకు ఇంతవరకు పంపిణీ చేయలేదు.
ప్రభుత్వం స్పందించాలి
ఖరీఫ్ సీజనన్ ప్రారంభంలోనే విత్తనాల కొరత తలెత్తడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. జిల్లాకు కేటాయించిన మొత్తం 27 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


