త్వరలో రోడ్డు విస్తరణ పనులు | - | Sakshi
Sakshi News home page

త్వరలో రోడ్డు విస్తరణ పనులు

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

కుప్పం: పట్టణ నడిబోడ్డున అర్ధతరంగా ఆగపోయిన రెండవ రీచ్‌ విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తామని జేసీ ఆదర్శ రాజేంద్రన్‌ స్పష్టం చేశారు. మంగళవారం కడా కార్యాలయంలో రోడ్డు విస్తరణ బాధితులతో ఆయన సమావేశమయ్యారు. పట్టణంలోని ఎంఆర్‌రెడ్డి సర్కిల్‌ నుంచి రైల్వే గేటు వరుకు రోడ్డు విస్తరణ పనులు సోమవారం నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. భవనాలు నష్టపోతున్న బాధితులకు అడుగుకు రూ.3,200 చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం తీర్మానించిందన్నారు. ఈ లెక్క న 124 మంది బాధితులు నష్టపోతుండగా.. ఇందులో 40 మంది రోడ్డు విస్తరణకు ఒప్పుకున్నారని చెప్పారు. వీరికి త్వరలో నష్టపరిహారం అందజేస్తామన్నారు. గతంలో నిర్ణయించిన 80 అడుగుల నుంచి ఇప్పుడు 60 అడుగులకు రోడ్డు విస్తరణ కుదించినట్టు పేర్కొన్నారు. సమావేశంలో కడా పీడీ వికాస్‌ మరమ్మత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌.మునిరత్నం, రెస్కో చైర్మన్‌ ప్రతాప్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

గంజాయిపై

సమాచారం ఇవ్వండి

చిత్తూరు అర్బన్‌: మాదక ద్రవ్యాలను అరికట్టడంలో భాగంగా గంజాయిపై జిల్లా వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తుషా ర్‌ డూడీ తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.28 లక్షల విలువైన 151 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 18 కేసులు నమోదుచేసి, 36 మందిని అరెస్టు చేశామ న్నారు. ఇక డ్రగ్‌ డిటెన్షన్‌ టెస్టింగ్‌ కిట్ల ద్వారా కూడా మాదకద్రవ్యాలు సేవించిన వాళ్లను గుర్తించి, కౌన్సెలింగ్‌.. కొన్నిచోట్ల అరెస్టులు కూడా ప్రారంభించామన్నారు. జిల్లాలో ఎక్కడై నా గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు జరిగితే డయల్‌–112, ఈగల్‌–1972, సెల్‌–9490617896 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement