వెరిఫికేషన్ పేరుతో ఉన్న పింఛన్లు
ఊడబెరుకుతున్నారు
దివ్యాంగుల పింఛన్లపైనే గురి
ఇప్పటికే మూడు వేల మంది బాధితులు
ఇప్పుడు అధికార పింఛన్ వెబ్‌సైట్ క్లోజ్!
అయోమయంలో అభాగ్యులు
‘అర్హులైన వారందరికీ నెలకు రూ.4 వేలు పింఛన్లు మంజూరు చేస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు రూ.10 వేలు. నేను మారాను.. నన్ను నమ్మండి’ అంటూ ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడు కల్లబొల్లిమాటలు ఒలకబోశారు. ప్రజలను నమ్మించి ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా రెండేళ్లు కావస్తున్నా ఒక్క కొత్త పింఛన్ ఇవ్వకపోగా.. ఉన్న పింఛన్లు ఎలా తొలగించాలోనని సమయోచనలో పడ్డారు. ఇందులో భాగంగానే సవాలక్ష సాకులు.. సర్వేలు.. వెరిఫికేషన్ల పేరుతో పింఛన్లు కోత పెడుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు పింఛన్ వెబ్‌సైట్‌నే క్లోజ్ చేసి పేదల జీవితాలతో ఆటలాడుతున్నారు. దీనిపై అభాగ్యులు రగిలిపోతున్నారు. పింఛన్ల కోత..వెబ్‌సైట్ క్లోజ్‌పై ప్రత్యేక కథనం..
చిత్తూరు కలెక్టరేట్ : కొత్త పింఛన్ల మంజూరు దేవుడెరుగు ఉన్న పింఛన్లను ఊడబెరుకుతున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అర్హులైన పేద లు, నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల పింఛన్ల ను సైతం వెరిఫికేషన్‌న్ సాకుతో తీసేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు మూడు వేల మంది దివ్యాంగుల పింఛన్లను నిలిపివేసింది. అర్హులైన దివ్యాంగ పింఛన్‌దారులకు నోటీసులు ఇస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లోని సదరం క్యాంపులకు తిరగలేక నయకయాతన అనుభవిస్తున్నారు.
గతంలో నిరంతరం.. నేడు గగనం!
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పింఛన్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియలా సాగేది. అప్పట్లో పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి గ్రామ వలంటీర్లే నేరుగా దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సచివాలయాల్లో ఆన్‌న్‌లైనన్ చేసేవారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతి ఆరు నెలలకోసారి (జూన్, డిసెంబర్‌లో) క్రమం తప్పకుండా కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెబ్‌సైట్‌ను పూర్తిగా నిలిపివేయడంతో అర్హులైన వారు నిత్యం సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
కొత్త అర్జీలకు తాళం!
గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ పింఛన్‌ల అధికారిక వెబ్‌సైట్‌ను పూర్తిగా మూసివేశారు. పింఛన్‌ల పెంపు, కొత్త అర్హుల గుర్తింపు పై ఊదరగొట్టిన పాలకులు ఇప్పుడు వెబ్‌సైట్‌నే ఆఫ్‌లైన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా కొత్త పింఛన్‌ల ఊసే ఎత్తడం లేదు.
గత వైఎస్‌ఆర్‌సీ ప్రభుత్వంలో మంజూరు చేసినవే
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 2,72,223 పింఛన్లు అందుతున్నాయి. ఈ పింఛన్లన్నీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైనవే కావడం గమనార్హం. ప్రస్తుతం సచివాలయాల్లో కేవలం ఒకే ఒక రకమైన పింఛన్‌న్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే పింఛనన్ పొందుతున్న భర్త మరణిస్తే, అతడి వారసత్వంగా ఆ పింఛన్‌్ ను భార్యకు బదిలీ చేసి ఇస్తున్నారు అంతే. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన కీలక హామీ ఇంతవరకు అమలు కాలేదు.
రెండేళ్లుగా
ఒక్క కొత్త పింఛన్ లేదు
కొత్త పింఛన్ ఇవ్వరా?
నా భర్త చనిపోయి సంవత్సరాలు అవుతోంది. ఆయన పోయాక నాకు ఎటువంటి ఆధారం లేదు. రెక్కాడితే గానీ డొక్కాడదు. వయసు పైబడడంతో ఇప్పుడు ఏ పనీ చేయలేకపోతున్నా. వితంతు పింఛన్ కోసం సచివాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు. ఇంతవరకు నాకు ఒక్క రూపాయి పింఛన్ మంజూరు కాలేదు. నా లాంటి దిక్కులేని వాళ్లను ప్రభుత్వమే ఆదుకోకపోతే మేం ఎలా బతకాలి?.
– బుజ్జమ్మ, బాధితురాలు, చిత్తూరు
భూమి వేరేవాళ్లకు రాసిచ్చినా..!
నాకు 60 ఏళ్లు దాటాయి. వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నా పేరు మీద భూమి ఉన్నట్టు చూపిస్తోందని, అందుకే పింఛన్ రాదని తిరస్కరించారు. నిజానికి నా పేరు మీద ఉన్న భూమిని ఎప్పుడో వేరే వాళ్ల పేరు మీదకు మార్చేశాను. ఇప్పుడు నా దగ్గర ఎలాంటి భూమి లేదు. కానీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఇంకా నా పేరే చూపిస్తోంది. అధికారుల తప్పునకు నాకు పింఛన్ లేకుండా చేస్తారా?.
– కనకమ్మ, బాధితురాలు, తవణంపల్లి


