ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్‌ ఢీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్‌ ఢీ

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

ఐరాల: ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్‌ ఢీ కొన్న ఘటన సోమవారం రాత్రి మండలంలోని గాజులపల్లెలో చోటుచేసుకుంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో పెనుప్రమాదం తప్పింది. తిరుపతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కాణిపాకం నుంచి తిరుపతికి ప్రయాణికులతో వెళుతోంది. ఈ క్రమంలో గాజులపల్లె వద్ద సింగిల్‌ లైట్‌తో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టింది. బస్సు రోడ్డు పక్కన ఉన్న మామిడి తోటలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు స్టీరింగ్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీసి చిత్తూరు ప్రభుత్వాస్రత్రికి తరలించారు.

యమడేంజర్‌

పలమనేరు: పట్టణ సమీపంలోని నాగమంగళం ఫ్‌లైవర్‌ ప్రమాదాలకు నిలయంగా మారింది. బెంగళూరు నుంచి తిరుపతి వైపు వేగంగా వేళ్లే వాహనాల నడుమ ఇదేమార్గంలో పలమనేరు పట్టణానికి వచ్చే వాహనాలు, బైక్‌లు ఇక్కడి ఫ్‌లైవర్‌ కింద దూరి పట్టణంలోకి రావాలి. రోడ్డుపై ఎలాంటి స్పీడ్‌బ్రేకర్లు, సూచిక బోర్డులు లేకపోవడంతో ఏమాత్రం ఆదమరిచినా వెనుక వేగంగా వచ్చే వాహనాలు రోడ్డు క్రాస్‌ చేసే వారిని ఢీకొట్టేస్తున్నాయి. దీనిపై హైవే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

తిరుపతిలో

ఉద్యోగ మేళా రేపు

తిరుపతి అర్బన్‌: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం జిల్లా అధికారి లోకనాథం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి తిమ్మినాయుడుపాళెం, ఆటోనగర్‌లోని భార్గ వి ఆటోమొబైల్స్‌ ప్రైవేట్‌ లివిడెట్‌ కంపెనీలో ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, ఐటీఐ చదువుకున్న వారు అర్హులుగా పేర్కొ న్నారు. సేల్స్‌ జనరల్‌ మేనేజర్‌, టీఎం లీడర్స్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, అకౌంట్స్‌ తదితర ఉద్యోగుల పొందవచ్చన్నారు. అదనపు సమాచారం కోసం 81435 76866 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

లైంగిక దాడి కేసులో

నిందితుడి అరెస్టు

తిరుపతి రూరల్‌: స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ వివాహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్‌ మండలం ఉప్పరపల్లికి చెందిన గోపీచంద్‌కు ఇప్పటికే వివాహమైనప్పటికీ మరో బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్‌ పోలీసులు, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తిరుపతి రూరల్‌ డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌ కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని సోమవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement