జూనియర్‌ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతులు | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతులు

Jun 16 2026 1:52 AM | Updated on Jun 16 2026 1:52 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖలో నాన్‌ టీచింగ్‌ కేడర్‌ నుంచి జూనియర్‌ లెక్చరర్లుగా పలువురు ఉద్యోగోన్నతులు పొందారని నాన్‌టీచింగ్‌ అసోసియేషన్‌ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షు లు కందాటి విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమ వా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మ డి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అర్హత, సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులు ఒకేషనల్‌ జూనియర్‌ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతి పొందారన్నా రు. పార్వతి, దీప్తి, శిరీష, అపర్ణ, అశ్విని, భా స్కర్‌, కిషోర్‌, శివకుమార్‌ తదితరులకు జూని యర్‌ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతి లభించిందన్నారు.

నేడు కరెంటోళ్ల జనబాట

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు. వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు.

సీనియార్టీ జాబితా ప్రదర్శన

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో వ్యవసాయ సర్వీసుల సీనియార్టీ జాబితాను సంబంధిత ఏఈ కార్యాలయాలల్లో ప్రదర్శించాలని ట్రాన్స్‌కో సీఎండీ శివశంకర్‌ ఆదేశించారు. సోమవారం కార్పొరేట్‌ కార్యాలయం నుంచి ఎస్‌ఈ, ఈఈలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సకాలంలో వ్యవసాయ సర్వీసులు విడుదల చేయాలన్నారు. అందులో జాప్యం చూపితే చర్యలు ఉంటాయన్నారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల నివాసాల పై రూఫ్‌ టాప్‌ సోలార్‌ సిస్టమ్స్‌ను అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. దశల వారీగా అందరికీ సోలార్‌ ప్యానల్స్‌ పెడతామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ అమర్‌బాబు, ఈఈలు మునిచంద్ర, సురేష్‌ పాల్గొన్నారు.

మొరంలో భారీ చోరీ

పలమనేరు: మండలంలోని మొరం గ్రామంలో పట్టపగలే డోర్‌లాక్‌ చేసిన ఇంట్లో దొంగలు పడి భారీ చోరీకి పాల్పడిన ఘటన సోమవారం కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు.. మొరం గ్రామానికి చెందిన దంపతులు దేవి, పురుషోత్తంరెడ్డి గ్రామ సమీపంలోని హ్యాచరీలో పనికి వెళ్తుంటారు. ఆ మేరకు సోమ వారం పొద్దున పనికెళ్లారు. వీరిద్దరు పిల్లలు బడికెళ్లా. ఇంటికి తాళం వేసి ఉండగా దొంగలు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటి ముందున్న గేట్‌ను తీసుకొని తాళం వేసిన తలుపును రాడ్‌తో తీసి లోనికెళ్లారు. ఇంట్లోని బీరువాను పగులగొట్టి అందులోని 35 గ్రాముల బంగారు, 600 గ్రాముల వెండి ఆభరణాలను చోరీ చేసి ఇంటి వెనుక వైపున్న తలుపు తీసుకొని ఉడాయించారు. చోరీ చేసిన సొత్తు విలువ రూ.5.7 లక్షలు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. కాగా చోరీ జరిగినప్పుడు ఇంటి వెనుక ఇద్దరు యువకులు ఉన్నట్టు కొందరు గ్రామస్తులు తెలిపారు. చోరీపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరు, వేలిముద్రల సేకరణ కార్యక్రమాలను చేపట్టారు.

మద్యం సేవించడానికి డబ్బుల్లేవని..

– చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

తవణంపల్లె : మద్యం సేవించడానికి డబ్బులు లేవని మనస్తాపానికి గురై చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మ హత్య చేసుకు న్న ఘటన తెల్లగుండ్లపల్లె దళితవాడలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌బాబు కథనం మేరకు.. మండలంలోని తెల్లగుండ్లపల్లె దళితవాడకు చెందిన రవి (52) మద్యం సేవించేవాడు. మద్యం సేవించడానికి డబ్బులు కావాలని తండ్రి మునస్వామి ని అడిగాడు. తండ్రి డబ్బులు లేవని చెప్పడంతో తెల్లగుండ్లపల్లెలోని కొండప్పనాయిని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించినా వీలుకాకపోవడంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుని భార్య దీప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement