పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ

Jun 16 2026 1:52 AM | Updated on Jun 16 2026 1:52 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపడుతున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఓటర్ల జాబితాను మరింత కచ్చితంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా రూపొందించేందుకు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–2026 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సోమవారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమైందన్నారు. జూలై 14 వరకు ఈ సర్వే నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. సేకరించిన సమాచారం ఆధారంగా జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. అన్ని సవరణల అనంతరం సెప్టెంబర్‌లో తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తామని తెలిపారు.

బీఎల్‌ఏలు చురుగ్గా పాల్గొనాలి

ఈ ప్రక్రియ పూర్తిగా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఇందులో రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌ లెవల్‌ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉదయ్‌, బాలసుబ్రమణ్యం, సురేంద్రబాబు, అట్లూరి శ్రీనివాస్‌, వాడ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement