చిత్తూరు కలెక్టరేట్ : మూడు రోజుల్లో పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్‌ల విస్తరణ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆద ర్శ్ రాజేంద్రన్ సిబ్బందిని ఆదేశించారు. సోమ వారం ఆయన కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడు తూ జిల్లాలో వాణిజ్య, గృహ అవసరాలకు పీఎన్‌జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయాలన్నారు. మూడు రోజుల్లోగా సమగ్రమైన కార్యాచరణ ప్రణా ళికను సమర్పించాలని మున్సిపల్, గ్యాస్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.
ఉచిత ప్రవేశాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని శారీరక విభిన్న ప్రతిభావంతులు, బధిరులు (చెవిటి), అంధులైన బాలికలకు బాలికల వసతి గృహంలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3 నుంచి డిగ్రీ వరకు చదువుకుంటున్న దివ్యాంగ బాలికల నూతన ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రెడ్డిగుంట బైపాస్ రోడ్డులో, కుటుంబ ఆరోగ్య సంక్షేమ భవనానికి ఎదురుగా నిర్మించిన నూతన భవనంలో ఈ ప్రత్యేక వసతి గృహంలో అడ్మిషన్‌లు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు 9440990698, 08572–296506 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
నిధులు విడుదల
చిత్తూరు కలెక్టరేట్: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా మొదటి దశ నివాసాల లెక్కింపు పరంగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు, గౌరవ వేతనాల పరంగా జిల్లాలోని చిత్తూరు నగరపాలక సంస్థకు రూ.42.35 లక్షలు, 28 మండలాలకు రూ.3.16 కోట్లు మంజూరైంది.


