కుప్పం మండలానికి చెందిన గంగమ్మ కుమారుడు ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం మ్యాపింగ్ కోసం ఆమె తన వివరాలను సచివాలయంలో అందజేసింది. రేషన్ కార్డులో ఉన్న పేరుకు, ఆధార్ కార్డులో ఉన్న పేరుకు ఒక అక్షరం తేడా ఉండడంతో మ్యాపింగ్ కాలేదు. ఆమె పది రోజులు కూలి పనులు మానేసి ఆధార్‌లో మార్పులు చేయించుకుని వస్తే సర్వర్ డౌన్ తర్వాత రండి అంటూ అధికారులు చెబుతున్నారు.
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈశ్వరమ్మ కుమా ర్తె అనురాధ తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లికి వందనం మ్యాపింగ్‌లో ఈశ్వరమ్మ బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కాలేదని దరఖాస్తును నిలిపివేశారు. ఆమె సచివాలయ సిబ్బందిని అడిగితే బ్యాంకుకు వెళ్లి చూసుకోవాలని చేతులెత్తేశారు. బ్యాంకు వారు కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తప్పు ఎక్కడ ఉందో లబ్ధిదారులకు వివరించలేకపోతున్నారు.
క్షేత్రస్థాయిలో అవగాహన లోపం
సచివాలయాలు, పాఠశాలల చుట్టూ తల్లిదండ్రుల ప్రదక్షిణలు
నిధుల్లో కోత విధించేందుకే ఆలస్యం చేస్తున్నారనే అనుమానాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాలకు సంబంధించి ప్రాథమి క, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2845 ఉన్నాయి. వీటిలో 2,30,042 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి తల్లికి వందనం పథకం వర్తింపజేయడానికి చేపట్టిన మ్యాపింగ్ మందకొడిగా సాగుతోంది. దీంతో విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గదర్శకాలు లేకపోవడం, అవగాహన కల్పించకపోవడమే జాప్యానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేయడమే తప్ప క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అడ్డంకులెన్నో...
గత వైఎస్సార్ సీపీ సర్కారు అమ్మఒడి పథకాన్ని పకడ్బందీగా అమలు చేసింది. కూటమి ప్రభు త్వం పథకానికి పేరు మార్చి అమలులో ఘోరంగా విఫలమైంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించలేకపోతోంది. పథకానికి అర్హత సాధించాలంటే నిబంధనలు, సాంకేతిక కారణాలు సాధారణ పేద కుటుంబాలకు శాపాలుగా మారాయి. కూటమి సర్కారు ఉదాసీనత వల్ల ప్రతి ఏటా అర్హులైన వేలాది మంది విద్యార్థులు పథకానికి దూరమవుతున్నారు.
ఆర్భాటపు మాటలు
ఎన్నికల ప్రచారంలో బడికి వెళ్లే ప్రతి బడ్డ కూ తల్లికి వందనం వర్తింపజేస్తామని కూట మి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు పథకానికి నిధుల కేటాయింపులో కోత పెట్టడానికే మ్యాపింగ్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు పెట్టి ఆలస్యం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ లబ్ధి చేకూరుస్తామని చెప్పి, ప్రస్తుతం రకరకాల కారణాలతో వడపోత కార్యక్రమానికి తెరలేపడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
క్షేత్ర స్థాయిలో అవగాహన కరువు
పథకం అమలు బాధ్యతలను విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ, సచివాలయ సిబ్బందికి అప్పగించారు. మ్యాపింగ్ యాప్‌లు సరిగ్గా పనిచేయకపోవడం, సర్వర్ డౌన్‌తో డేటా నమోదు నిలిచిపోతోంది. జిల్లాలో మ్యా పింగ్ ప్రక్రియ 50 శాతం కూడా కాలేదు. ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ, బ్యాంక్ ఖాతాల మ్యాపింగ్ వంటి అంశాలపై సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదు. తల్లిదండ్రులు సచివాలయాలు, పాఠశాలల చుట్టూ తిరుగుతున్నా రు. అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతోనే మ్యాపింగ్ నత్తనడకన సాగుతోంది.
తల్లికి వందనం
పథకానికి అడ్డంకులెన్నో


