ఎరువు.. బరువు! | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. బరువు!

Jun 15 2026 12:41 AM | Updated on Jun 15 2026 12:41 AM

– 8లో

ఎరువుల కోసం ముందుగా ఏపీఏఐఎంఎస్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మామిడి..అన్‌లోడ్‌ లేదు మరి

తవణంపల్లె: మండలంలోని గుజ్జు ఫ్యాక్టరీల వద్ద మామిడి కాయల లోడ్డుతో ఉన్న ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. సకాలంలో అన్‌లోడ్‌ కాకపోవడంతో రోజుల తరబడి రైతులు అక్కడే నిరీక్షించాల్సి వస్తోంది. మండలంలోని గుజ్జు ఫ్యాక్టరీల్లో కొంత మంది టోకెన్లు ఇస్తున్నారు. కొన్ని ఫ్యాక్టరీల్లో సీరియల్‌ ప్రకారం అన్‌లోడ్డు చేయిస్తామని ట్రాక్టర్లను అనుమతిస్తున్నారు. ఎఫ్‌–3 ఫ్యాక్టరీలో చాంబర్ల ఖాళీ కావడంలేదని అన్‌లోడ్డు ఆపివేశారు. దీంతో సుమారు వంద ట్రాక్టర్లు అన్‌లోడ్డు కోసం వేచి ఉన్నాయి. రైతులు అక్కడే పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.

ఓటరు సేవలకు

కాల్‌ బుకింగ్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)లో ఓటర్ల మ్యాపింగ్‌కు సంబంధించి బీఎల్‌వో ఓటర్లను సంప్రదించకుంటే వారినే నేరుగా ఇంటికి పిలిపించుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ మేరకు బీఎల్‌వోలతో కాల్‌ బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పించింది. ఇందుకు ఓటర్లు ఈసీఐనెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే voters.eci.gov.in వెబ్‌సైట్‌లో బుక్‌ ఏ కాల్‌ విత్‌ బీఎల్‌వో ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కాల్‌ బుకింగ్‌ చేసుకున్న 48 గంటల్లోగా బీఎల్‌వోలు సదరు ఓటరును సంప్రదిస్తారు. ఓటరు సేవలకు సంబంధించి సందేహాలనూ నివృత్తి చేసుకోవచ్చు. కాల్‌ బుకింగ్‌ లు ఎన్ని జరిగాయి? ఏ సేవలపై వివరాలను ఓటర్లు అడిగారు? చూపిన పరిష్కారం ఏమిటి? అనే వివరాలను ముఖ్య ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షిస్తుంటారు. సర్‌ ప్రక్రియలో ఈ నెల 14వ తేదీలోపు ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి చేసి, 15 నుంచి జూలై 14 వరకు బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారు. సెప్టెంబర్‌ 22వ తేదీన ఓటర్ల తుది జాబితాలను ప్రచురిస్తారు. ఓటరు సేవలకు కాల్‌ బుకింగ్‌ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు ప్రజలను కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement