తమిళనాడు కాయలపైనే మోజు | - | Sakshi
Sakshi News home page

తమిళనాడు కాయలపైనే మోజు

Jun 15 2026 12:41 AM | Updated on Jun 15 2026 12:41 AM

స్థానిక రైతుల మామిడిని కొనుగోలు చేయని ఫ్యాక్టరీలు టోకెన్ల మంజూరు బంద్‌ ఇబ్బందులు పడుతున్న రైతులు పట్టించుకోని అధికారులు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలోని కొన్ని మామిడి ర్యాంపులు గుడిపాల పల్ప్‌ ఫ్యాక్టరీలతో కుమ్మకై ్క పనిచేస్తున్నాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రైతుల నుంచి కేజీ రూ.4లకే తోతాపురి మామిడిని కొనుగోలు చేసి, అదే కాయలను ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు తమిళనాడు నుంచి వచ్చే మామిడిని కేజీ రూ.5 నుంచి రూ.5.50 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. స్థానిక రైతుల కాయలకు నిరాకరిస్తూ బయటి రాష్ట్రాల కాయలకు ప్రాధాన్యం ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల నుంచి రైతులు తమ పంటను ట్రాక్టర్లలో తీసుకువచ్చి రోజుల తరబడి వేచి ఉన్నా పట్టించుకోవడం లేదు. రేపు రండి అంటూ తిరిగి పంపిస్తున్నారని రైతులు వాపోతున్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన లారీలను నేరుగా ఫ్యాక్టరీ లోపలికి పంపించి అన్‌లోడ్‌ చేసుకుంటున్నట్టు వాపోతున్నారు. పలు ఫ్యాక్టరీల వద్ద టోకెన్ల జారీని నిలిపివేస్తూ నోటీసులు అంటించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో చాలామంది రైతులు కోతలను తాత్కాలికంగా ఆపివేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాయలను తోటల్లోనే వదిలేయాల్సి వస్తుందని, లేకుంటే రోడ్ల పక్కన పారబోయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

గుడిపాలలో కిక్కిరిసిన లారీలు

గుడిపాల ప్రాంతంలోని ఫ్యాక్టరీల ముందు రోజూ భారీ సంఖ్యలో లారీలు నిలుస్తున్నా యి. తమిళనాడు నుంచి కాయల రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు మా త్రం పరిశీలనలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, లారీల రాకపోకలపై కఠిన చర్యలు కనిపించడం లేదని అంటున్నారు.

గుడిపాల మండలంలోని పల్ప్‌ ఫ్యాక్టరీలు ర్యాంపులతో కుమ్మక్కయ్యాయి. తమిళనాడు నుంచి వచ్చిన లారీల్లోని మామిడి కాయలను అన్‌లోడ్‌ చేస్తూ జిల్లాలోని రైతుల కాయలను కొనుగోలు చేయడం లేదు. టోకెన్ల జారీని సైతం ఆపేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మామిడి కాయలను రోడ్ల పక్కన పారబోయాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులను పిప్పి చేస్తున్నారు

నాకు 15 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ కాయ లు అమ్ముకోవడం కష్టతరంగా మారింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఫ్యాక్టరీకి కాయలు తోలికెళితే దింపేందుకు మూ డు రోజులు అవుతోంది. అదే సిఫార్సు ఉంటే గంటల్లో అయిపోతున్నాయి. గుడిపాలలో కొనుగోలు పూర్తిగా నిలిపేశారు. లారీల్లో వచ్చే కాయలను మాత్రం తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు.

– సుబ్రమణ్యం నాయుడు,

ఎగువ కండ్రిగ, చిత్తూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement