యాప్‌లో నమోదు చేసుకుంటేనే ఎరువులు అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయలేని ప్రభుత్వం ప్రైవేటు డీలర్లకు లబ్ధి చేకూర్చేందుకే అంటున్న రైతులు
●
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నా యి. పంటలకు అవసరమైన ఎరువులు తీసుకోవాలంటే ముందుగా యాప్‌లో నమోదు చేసుకోవాలని కొత్త నిబంధన తీసుకువచ్చింది. దానిపై అవగాహన లేని రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంతకు ముందు ఎన్నడూ ఈ పరిస్థితి లేదని, ఇప్పుడు ప్రభుత్వం లేనిపోని నిబంధనలు తీసుకువచ్చి ఇబ్బంది పెడుతోందని రైతులు వాపోతున్నారు.
బైరెడ్డిపల్లె : ఎరువులు కావాలంటే రైతులు ముందుగా ఏపీఏఐఎంఎస్ యాప్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే రైతులకు ఇబ్బందికరంగా తయారైంది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగానే ఉన్నాయి. దీనికితోడు ఇక మీదట సాగు చేసే పంటలను ముందస్తుగా రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించాలని, తర్వాతే ఎంత మేర ఎరువులు ఇవ్వాలో నిర్ణయిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పైగా భూములు వెబ్‌ల్యాండ్‌లో ఉంటేనే ఎరువులు ఇస్తామని, లేకుంటే ఇవ్వమని తెగేసి చెబుతున్నారు.
యాప్ ద్వారానే అమ్మకాలు
ఇక నుంచి యాప్ ద్వారానే ఎరువుల అమ్మకాలు చేయనున్నారు. ఈనెల 8 నుంచి యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు ప్రారంభించారు. అధిక మోతాదులో ఎరువుల వేస్తే భూమికి ముప్పుతో పాటు పర్యావరణానికి కూడా ఇబ్బందే.
– గీతాకుమారి,
వ్యవసాయశాఖ అధికారి


