రైతులు సాగు చేసిన పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా అందించాలి. ప్రస్తుతం సాగు ఖర్చు ఎక్కువైంది. కూలీల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి తరుణంలో యాప్ ద్వారా యూరియా పంపిణీ చేస్తే రైతులకు మరింత భారంగా మారుతుంది. పెట్టుబడి కూడా భారీగానే పెరుగుతుంది.
– శివ, మిట్టకుర్రపల్లె
కౌలు రైతుల మాటేంటి
రైతులకు ఎరువులను యాప్ ద్వారా ఇస్తామని చెబుతున్న వ్యవసాయశాఖ కౌలు రైతులకు ఎలా ఇస్తారో చెప్పడం లేదు. కౌలు రైతులకు కార్డులు కూడా ఇవ్వలేదు. కౌలుకు తీసుకుని సాగు చేసే భూమికి ఎరువులు ఎలా ఇస్తారో తెలియజేయాలి. పంటకు ధరలు లేకుంటే అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. – మురళి, తీర్థం
అరకొరగానే..
సేంద్రియ ఎరువులు ఎంత వాడినా రసాయన ఎరువులు కాస్తా పంటల కు వేస్తేనే దిగుబడి బాగా వస్తుంది. యాప్ ద్వారా ప్రభుత్వం అరకొరగానే ఎరువులు ఇస్తోంది. ప్రస్తు తం ఉన్న ఖర్చులతో పాటు ఎరువుల వ్యయం భా రంగా మారితే వ్యవసాయం మరింత కష్టంగా మారుతుంది. – సుబ్రమణ్యం, నాగిరెడ్డిపల్లె


