– బాక్సు రూ.400
పలమనేరు : టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం పలమనేరు మార్కెట్‌లో బాక్సు (14 కిలోలు) టమాట రూ.400 పలికింది. సమీపంలోని కర్ణాటక రాష్ట్రం కోలారులో బాక్సు రూ.505 చేరింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్‌లో డిమాండ్ కారణంగా ఇక్కడి మార్కెట్లలో టమాట ధర పెరిగినట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నా రు. పలమనేరు మార్కెట్‌కు వస్తున్న టమాటా రవాణాకు అనుకూలంగా లేకపోవడంతో రేటు కాస్త తగ్గిందని, కోలారుకు వెళ్లే సరుకు మరింత నాణ్యంగా ఉండడంతో అక్కడ పెరిగిందని వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో సైతం ధర ఆశాజనకంగానే ఉంటుందని తెలియజేస్తున్నారు. దీంతో టమాట రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


