సిఫార్సులకే కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

సిఫార్సులకే కొనుగోళ్లు

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

– మామిడిని తీసుకురావద్దని నోటీసు

గుడిపాల: ఫుడ్‌ అండ్‌ ఇన్స్‌ గుజ్జు పరిశ్రమ యాజమాన్యం కేవలం సిఫార్సులకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. రోజూ సుమారు 50 ట్రాక్టర్ల తోతాపురి రకం కాయలను సిఫార్సులతోనే తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సాధారణ రైతులు మామిడి కాయలు తేవద్దని ఫ్యాక్టరీ ఎదుట శనివారం నోటీసును అంటించింది. రెండురోజుల పాటు మామిడికాయలను కొనుగోలు చేయమని నోటీసులో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న మామిడికాయల అన్‌లోడింగ్‌కు రెండురోజుల సమయం పడుతుందని వెల్లడించింది. మరోవైపు తాసా జ్యూస్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం తమిళనాడు నుంచి మామిడికాయలను కొనుగోలు చేస్తోంది. జిల్లా రైతులను పట్టించుకోవడం లేదు. రోజూ తూతూమంత్రంగా 50 టోకెన్లు జారీ చేసి చేతులుదులిపేసుకుంటోంది. ఆయా ఫాక్టరీల యాజమానులపై రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement