గత ఏడాది మామిడి రైతులకు కోలుకోలేని దెబ్బపడింది. మళ్లీ ఈసారి అదే దెబ్బ. ప్రస్తుతం మామిడి పంట సర్వనాశనమవుతోంది. కేజీ రూ.5, రూ.6 అని బోర్డు పెట్టారు. కేజీ కాయ అమ్మితే టీ, కాఫీ ఖర్చులకు కూడా రావడంలేదు. ఓ వైపు తోటలోని కాయ లు రాలిపోతున్నాయి. దీంతో రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు. వెంటనే సర్కారు స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి. లేకుంటే రైతుల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటానికి దిగుతుంది. – ఎంసీ విజయానందరెడ్డి,
వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త


