తిరుపతి సిటీ: నగరంలోని న్యూ బాలాజీ కాలనీలో ఉన్న ఎస్‌డీహెచ్‌ఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఉమ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాకు 2021–26 వరకు ఉత్తీర్ణులైన బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీజెడ్‌సీ, బీసీసీఏ, బీబీఎం, బీసీఏ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. మెగా జాబ్ మేళాలో సజిలిటీ, సదర్లాండ్, ఫస్ట్‌సోర్స్, అలోరికా, అప్తారా, టెలిపెర్ఫార్మెనన్స్, ఒమేగా హెల్త్‌కేర్, ఆటోసెనన్స్, పేస్, ఆల్‌సెట్, కాల్క్‌లైట్ టెక్నాలజీస్ వంటి ప్రముఖ ఎమ్‌ఎన్‌సీ సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 7989004486, 9490557045 నంబర్లను సంప్రదించాలని కోరారు.
కిక్కిరిసిన కాణిపాకం
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి భక్తులు శనివారం పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులతో దర్శన మార్గాలు, క్యూలు కిక్కిరిసిపోయాయి. రద్దీని దృష్టిలో ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూలలో తాగునీరు, విశ్రాంతి సదుపాయం, వైద్య సేవలు, భద్రత కల్పించా రు. భక్తులు సజావుగా స్వామివారిని దర్శించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదనపు సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
ఫేస్‌బుక్ ప్రేమ.. చివరికి మోసం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సోషల్‌మీడియా వేదికగా పరిచయం..ఆపై ప్రేమ ముసుగులో నమ్మకం..చివరికి మోసం చేసిన ఘటన శనివారం చిత్తూరు నగరంలో జరిగింది. వివరాలు.. చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట చెక్‌పోస్టుకు చెందిన విజయ్, తమిళనాడులోని చైన్నెకి చెందిన ఓ మహిళ ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. క్రమేణా పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో మురకంబట్టులో ఐదు నెలల పాటు సహజీవనం చేశారు. ఈ సమయంలో మహిళా నుంచి విజయ్ దశలవారీగా రూ.8లక్షల నగదు, 12గ్రాముల బంగారం తీసుకుని మోసం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపారు.


