కార్వేటినగరం : శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శనివారం రమణీయంగా రథోత్సవం నిర్వహించారు. రుక్మిణీ, సత్యభామ సమేతంగా స్వామివారు దివ్య రథంపై విహరించారు. అశేష భక్తజనుల గోవిందనామస్మరణల నడుమ పురవీధుల్లో ఊరేగారు. ఈ క్రమంలోనే సాయంత్రం వేడుకగా ఊంజల్ సేవ జరిపించారు. రాత్రి అశ్వవాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. సూపరింటెండెంట్ శ్రీనివాసులురెడ్డి, ఆలయాధికారి చంగల్రాయులు, కంకణభట్టార్ మురళీకృష్ణ పాల్గొన్నారు.
నేడు చక్రస్నానం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివా రం ఉదయం 9 గంటలకు స్కంధ పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి చంగల్రాయులు తెలిపారు. సాయంత్రం ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిపూర్ణం కానున్నట్లు వెల్లడించారు.


