పలమనేరు : గొబ్బిళ్లకోటూరు డంపింగ్ యార్డులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ పనులను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీనాభాను శనివారం తనిఖీ చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్లాంటు అందుబాటులోకి వస్తే పట్టణంలో కంపోస్ట్ సమస్య తీరుతుందని తెలిపారు.
అధ్యాపక పోస్టుల
దరఖాస్తులకు రేపే తుది గడువు
తిరుపతి సిటీ: ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీ, కుప్పం ద్రావిడ వర్సిటీలో పలు అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు సోమవారంతో ముగియనుంది. ఈ మేరకు ఇప్పటికే ఉన్నత విద్యామండలి అధికారులు సమాచారాన్ని వెలువరించారు. ఈ నెల 8వ తేదీతో ముగిసిన గడువును పలువురి అభ్యర్థన మేరకు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలోని మూడు వర్సిటీల్లోని పోస్టుల కోసం సుమారు 21 వేల దరఖాస్తులు అందినట్లు సమాచారం.


