నిరసనల హోరు | - | Sakshi
Sakshi News home page

నిరసనల హోరు

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

చంద్రబాబు నాయుడు పాలనపై

రోడ్డెక్కిన వైనం

సూపర్‌ సిక్స్‌.. తప్పుడు మ్యానిఫెస్టోపై నిలదీత

జిల్లా వ్యాప్తంగా పెల్లుబుకిన నిరసన ర్యాలీలు

చిత్తూరు నగరంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో గంగినేని చెరువు నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులతో రోడ్లన్నీ కిక్కిరిశాయి.

నగరిలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో ఓంశక్తి ఆలయ సమీపంలోని బైపాస్‌ కూడలి వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహం నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఇందులో ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకనరెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వంచనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీడీనెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో పుత్తూరు రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయక్త కృపాలక్ష్మి జీడీనెల్లూరులోని జైన్‌ మామిడి కాయల ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి రైతుల బాధలను తెలుసుకున్నారు.

పూతలపట్టులో నియోజకవర్గ సమన్వయకర్త సునీ ల్‌కుమార్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు.

పలమనేరులో నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ ఆధ్వర్యంలో మార్కెట్‌ కమిటీ వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహం నుంచి మదనపల్లె రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం కూడలి వరకు ర్యాలీ చేశారు.

కుప్పంలో నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ భరత్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీ చేపట్టారు.

చిత్తూరులో నిరసన ర్యాలీ చేస్తున్న విజయానందరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు

పలమనేరులో ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు

‘‘సూపర్‌ సిక్స్‌ పథకాలన్నారు.. పేదలకు సంక్షేమమే ధ్యేయమన్నారు.. సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెప్పారు.. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు. ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగులకు భృతి కింద రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు పూర్తయినా ఏ ఒక్కటీ చేయలేదు. అధికారం కోసం తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఇదేనా బాబూ నీ చిత్తశుద్ధి’’ అని వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ర్యాలీలతో హోరెత్తించారు.

టీడీపీ మ్యానిఫెస్టోను తగలబెడుతున్న భూమన, ఆర్‌కే రోజా

కుప్పంలో నిరసన ర్యాలీలో ఎమ్మెల్సీ భరత్‌, వైఎస్సార్‌ సీపీ నేతలు

పూతలపట్టులో ర్యాలీ చేస్తున్న సునీల్‌కుమార్‌, నాయకులు

‘కూటమి’ మోసాలపై కదం తొక్కిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

చిత్తూరు కార్పొరేషన్‌/చిత్తూరు అర్బన్‌ : అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు వాటిని నెరవేర్చలేదని వైఎస్సార్‌సీపీ నాయ కులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి ఏటా ఆడబిడ్డ నిధి అన్నారని, ఇప్పటి వరకు ఆ పథకం ఊసేలేదని మండిపడ్డారు. ఒక్క కొత్త పింఛన్‌ ఇవ్వలేదని, డీఎస్సీలో ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్‌ రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. రెండేళ్లుగా మామిడికి కనీస గిట్టుబాటు ధర కల్పించలేదని, రైతులు అప్పుల్లో కూరుకుపోయారని దుయ్యబట్టారు. రెండేళ్లుగా వంచన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని మండిపడ్డారు. కూటమి నేతలు ఇచ్చిన తప్పు డు హామీల మానిఫెస్టో ప్రతులకు నిప్పు పెట్టారు. పూతలపట్టులో టీడీపీ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉందని చెబు తూ పోలీసులు వైఎస్సార్‌ సీపీ నాయకులు చేస్తున్న ర్యాలీని కొంతసేపు ఆపేశారు. అలాగే పలమనేరులో డీఎస్సీ భూతం దిష్టిబొమ్మను దహనం చేయడానికి నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement