యోగాతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

కాణిపాకం: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం సాధ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. రానున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఆవరణలో జిల్లా టూరిజం శాఖ ఆధ్వ ర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ యోగాతో మానసిక ఒత్తిడిని జయించవచ్చని తెలిపారు. అనంతరం యోగా శిక్షకులు జి.శ్రీనివాసులు నాయు డు యోగాసనాలు వేయించారు. కార్య క్రమంలో డీఆర్‌ఓ కె.మోహన్‌ కుమార్‌, కాణిపాకం ఆలయ ఈఓ పెంచల కిశోర్‌, ఆర్డీఓ శ్రీనివాసులు, చైర్మన్‌ మణి నాయుడు, ఎస్‌ఐ నరసింహులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

మెనూ అమలు తప్పనిసరి

చిత్తూరు కలెక్టరేట్‌ : మధ్యాహ్నభోజన పథకం మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు ఆదేశించా రు. ఆయన శుక్రవారం డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశా రు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం అమలులో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు పాఠశాలలకు అందిన విద్యార్థి మిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. గుడిపాల ఎంఈవో హసన్‌బాషా, టీచర్లు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్‌ గోగర్భం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 75,428 మంది స్వామిని దర్శించుకున్నారు. 42,566 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement