రాష్ట్రాన్ని పీడిస్తున్న చంద్రగ్రహణం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని పీడిస్తున్న చంద్రగ్రహణం

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబా బు వాటిని అమలు చేయకుండా ప్రజలకు వంచిస్తూ చంద్ర గ్రహణంలా పీడిస్తున్నారు. కూటమి నాయకులు ప్రజలకు చేసిన మోసాన్ని వివరించేందుకే ఈ నిరసన చేపట్టాం. విద్య, వైద్యం ప్రజలకు అందడం లేదు. రైతులకు తీరని మోసం చేశారు. అధికా రం కోసం అలవికాని హామీలిచ్చారు. లక్షల కోట్లు అప్పులు తీసుకువస్తున్నారు. హామీలు అమలు చేశారా అంటే అదీ లేదు. ప్రతిపక్షంపై విమర్శలు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ కాలయాపన చేస్తున్నారు.

– భూమన కరుణాకరరెడ్డి,

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

420 మ్యానిఫెస్టో

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో కూ డిన మ్యానిఫెస్టో 420 మ్యానిఫెస్టోగా మారింది. వాటి ప్రచారానికి రూ.కోట్లను దారపోశా రు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పేరిట పంగనామా లు పెట్టారు. ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి న పవన్‌ కల్యాణ్‌ అధికారంలో వచ్చాక ఏమీ చేయలేదు. తమిళనాడు సీఎం విజయ్‌ పొత్తు లేకుండా గెలిచి ప్రజలు మెచ్చేలా పాలన చేస్తున్నారు. ఆయన్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి.

– ఆర్‌కే రోజా, మాజీ మంత్రి,

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement