19 స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు | - | Sakshi
Sakshi News home page

19 స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ వైద్యుల పోస్టుల పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీకి చర్యలు చేపట్టినట్లు డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కె.పద్మాంజలిదేవి తెలిపారు. ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పోస్టుల భర్తీ కోసం జూన్‌ 18వ తేదీ ఉదయం 10 మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిత్తూరులోని డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామ ని తెలిపారు. గైనకాలజీ, రేడియాలజీ, ఈఎన్‌ టీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, అన స్థీషి యా విభాగాలు, క్యాజువాలిటీ జనరల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అర్హత కల అభ్యర్థులు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, జిరా క్స్‌ ప్రతులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. ఎంపిక ప్రక్రియ నిబంధనల మేరకు పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల అధికారిక వెబ్‌సైట్లలో ఉన్నాయని పేర్కొన్నా రు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ వివరాలను పరిశీలించాలని వెల్లడించారు.

ఒకే యాప్‌లోకి

ఆరు ఆరోగ్య కార్యక్రమాలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ప్రజారోగ్య సేవలను మరింత సులభతరం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి శుక్రవారం చిత్తూరు నగరంలోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర డిజిటల్‌ విధానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగశశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌సీడీ (గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి అసంక్రమణ వ్యాధులు), జనని (మాతా–శిశు ఆరోగ్యం), నిక్షయ్‌ (క్షయవ్యాధి నియంత్రణ), పీఎంఎన్‌డీపీ (డయాలసిస్‌ రోగులకు సేవలు), యువిన్‌ (వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం), ఎస్‌సీడీ (సికిల్‌సెల్‌ వ్యాధి) వంటి ఆరు కీలక ఆరోగ్య కార్యక్రమాలను ఒకే యాప్‌లో సమీకరించే విధానాన్ని వివరించారు. శిక్షణ పొందిన అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు.

బెల్టు షాపులపై టీడీపీ

మహిళానేత ఫిర్యాదు ?

శాంతిపురం: కుప్పం నియోజకవర్గంలో విచ్ఛలవిడిగా సాగుతున్న బెల్టుషాపుల బాగోతంపై అధికార పార్టీకి చెందిన ఓ మహిళా నేత పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారనే వార్త సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలపై విపక్షాలు విమర్శించినా, మీడియా వెలుగులోకి తెచ్చినా పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి ఇది చెంప పెట్టని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. గ్రామాల్లో అడ్డగోలుగా వెలసిన బెల్టు షాపులు మందుబాబుల ఆరోగ్యాన్ని, వారి కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. బెల్టు షాపుల్లో అమ్మకాల జోరును గమనించిన అధికారిక షాపుల నిర్వాహకులు పొరుగున ఉన్న కర్ణాటక నుంచి మద్యం తెచ్చుకోకుండా నేరుగా చిల్లర దుకాణాలకు డోర్‌ డెలివరీ ద్వారా స్టాకును చేరవేస్తున్నారు. బెల్టు షాపులను నిర్మూలిస్తామని సీఎం చంద్రబాబు పదేపదే చెప్పినా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే మద్యం విక్రయా లు జోరుగా సాగడం గమనార్హం. ఈ తతంగంపై స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారు లు ప్రతి పక్షాల విమర్శలను, సీఎం ఆదేశాలను పట్టించుకోవడం లేదని స్థానికులు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఒక మహిళా నాయకురాలు పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రెస్స ల్‌ సిస్టం (పిజీఆర్‌ఎస్‌) ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది. ఇప్ప టికై నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఈ సమస్యపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

మహిళా వైద్యకళాశాలలో రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీలు

తిరుపతి తుడా: స్విమ్స్‌ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఫిజియాలజీ విభాగం ఆధ్వర్యంలో 7వ రాష్ట్రస్థాయి హయగ్రీవ–2026 క్విజ్‌ పోటీలు ఘనంగా నిర్వహించారు. గురువారం పద్మావతి వైద్య కళాశాల లెక్చర్‌ గ్యాలరీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్వీ కుమార్‌ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు వైద్యకళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీలు నిర్వహించామన్నారు. వైద్య విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఫిజియాలజీ విభాగం ఏడేళ్లుగా హయగ్రీవ క్విజ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృత్తి పరమైన మెలకువలు తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీన్‌ డాక్టర్‌ అలోక్‌ సచన్‌, విభాగాధిపతి డాక్టర్‌ శరణ్‌ బి సింగ్‌, పార్మాకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఉమామహేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement