చిత్తూరు అర్బన్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం అందరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. చిత్తూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయసేవా సదన్ భవనంలో శుక్రవారం బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికారులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పిల్లలను బడికి పంపకుండా పనులకు పంపడం తగదన్నారు. దీనివల్ల వారి భవిష్యత్తుకు సమాధి కడుతున్నామన్నారు. చదువుకునే వయస్సులో పిల్లలను పనులకు పంపడంతో ఒక తరం అమూల్యమైన బాల్యాన్ని కోల్పోతోందన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. పోక్సో చట్టం, న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. అనంతరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలను కృషి చేద్దామంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జువైనల్ డీపీవో లక్ష్మీపతి, ఎకై ్సజ్ ఏఈఎస్ కృష్ణకిషోర్‌రెడ్డి, డీఆర్‌డీఏ డీపీఎం మంజుల, సహాయ కార్మిక శాఖ అధికారి రోశయ్య పాల్గొన్నారు.


