హాకీ సీనియర్‌ పురుషుల జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

హాకీ సీనియర్‌ పురుషుల జట్టు ఎంపిక

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సీనియర్‌ పురుషుల జట్టు ఎంపికను గురువారం నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకాలకు పోటీలు నిర్వహించి, జట్టును ఎంపిక చేశారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహిస్తున్న 16వ ఏపీ హాకీ సీనియర్‌ పురుషుల రాష్ట్ర స్థాయి పోటీల్లో తిరుపతి జిల్లా జట్టు పాల్గొననుంది. జిల్లా జట్టుకు ఎంపికై న హాకీ క్రీడాకారులను హాకీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంజన్‌రాజ్‌, ఆదిత్య, కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్‌కృష్ణ అభినందించారు.

మామిడి కాయల కొనుగోలుకు బ్రేక్‌?

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోని పలు ఫ్యాక్టరీలు మామిడి కాయల కొనుగోలు బ్రేకులు వేశాయి. టోకెన్ల పంపిణీని ఆపేశాయి. వచ్చేవారం నుంచి కొనుగోలు చేస్తామని పేర్కొన్నాయి. దీంతో మామిడి రైతులు కాయ లు కోయకుండా వదిలేశారు. వర్షాలు కురిస్తే కాయలు రాలిపోవడంతో పాటు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి పూర్తి స్థాయిలో కాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement